Oil India: భారత ఇంధన రంగంలో మరో మైలురాయి..! అండమాన్‌లో గ్యాస్ రిజర్వులు వెలుగులోకి..!

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విద్యుత్ శాఖ అధికారులు శుభవార్త చెప్పారు. ఇప్పటివరకు విద్యుత్ శాఖ నుంచి వచ్చే అప్డేట్లు వినియోగదారులపై భారంగా మిగిలేవి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా మారింది. వినియోగదారులపై ట్రూఅప్ భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. దాంతో రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు రూ. 923.55 కోట్ల ఊరట లభించనుంది. దీనిపై ఏపీఈఆర్‌సీ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

AP Highway: ఏపీలో కొత్తగా ఆరు వరుసల రహదారి.. ఆ రూట్లోనే..! డెల్టా నుంచి హైదరాబాద్‌కు నేరుగా స్పీడ్‌గా..!

2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను డిస్కంలు దాఖలు చేసిన ట్రూఅప్ మొత్తానికి సంబంధించి ఏపీఈఆర్‌సీ రూ. 1,863.64 కోట్లకు మాత్రమే ఆమోదం తెలిపింది. అయితే డిస్కంలు వినియోగదారుల నుంచి వసూలు చేసిన మొత్తం రూ. 2,787 కోట్లు. దీంతో ఆమోదించిన మొత్తానికి మించి వసూలైన రూ. 923.55 కోట్లను వినియోగదారులకు తిరిగి చెల్లించాలని నిర్ణయించింది. దీనిని ట్రూడౌన్ రూపంలో అమలు చేస్తారు. ఈ నిర్ణయం వల్ల సాధారణ వినియోగదారుల బిల్లులు కొంతవరకు తగ్గి ఊరట లభించనుంది.

Bhagavad Gita: నశించేది జగత్తే.. నిలిచేది ఆత్మ స్వరూపమే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -16!

అధికారుల ప్రకారం, ట్రూడౌన్ చార్జీల రూపంలో వచ్చే నవంబర్ 2025 నుంచి అక్టోబర్ 2026 వరకు విద్యుత్ బిల్లుల్లో ఈ మొత్తాన్ని సర్దుబాటు చేయనున్నారు. దీని వల్ల యూనిట్‌కు 13 పైసలు తగ్గింపు లభిస్తుంది. అంటే గత ఏడాది 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు వినియోగదారులు ఉపయోగించిన యూనిట్లకు అనుగుణంగా లెక్కకట్టి, రాబోయే నెలవారీ బిల్లుల్లో తగ్గింపు జమ అవుతుంది. ఉదాహరణకు, ఎవరు గతేడాది 100 యూనిట్లు వినియోగించి ఉంటే, వారి బిల్లులో రూ.13 తగ్గింపు లభిస్తుంది.

Aadhar: ఆధార్ సర్వీసులకు భారీ షాక్..! అక్టోబర్ 1 నుంచి పెరిగిన రుసుములు..!

సాధారణంగా ట్రూఅప్ అంటే ఖర్చులు పెరిగితే వినియోగదారులపై అదనపు భారం మోపడం. కానీ ఈసారి తొలిసారి రాష్ట్రంలో ట్రూడౌన్ (ఛార్జీల తగ్గింపు) అమలు కానుంది. డిస్కంలకు అనుమతించిన ఖర్చు కన్నా తక్కువ ఖర్చు అయ్యే పరిస్థితుల్లో, ఆ మిగిలిన మొత్తాన్ని వినియోగదారులకు తిరిగి జమ చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లలో తీసుకున్న చర్యల వల్ల ఈ అవకాశం దక్కిందని అధికారులు పేర్కొన్నారు. ఈ నిర్ణయం విద్యుత్ వినియోగదారులకు పెద్ద ఊరటగా భావిస్తున్నారు.

Tamilnadu Head TVK : విజయ్ సభ.. ఆనందం నుంచి ఆవేదనకు.. రాజకీయ వర్గాల్లో వేడెక్కిన చర్చలు.. అల్లుఅర్జున్ తర్వాత విజయ్ అరెస్టా!
NTRs Devara-2 : స్క్రీన్ పై ఎన్టీఆర్ తాండవం మరోసారి.. దేవర-2 అధికారిక ప్రకటన!
Movie: 140 కోట్ల వసూళ్ల దాకా దూసుకెళ్లిన ‘మిరాయ్’..! ఇప్పుడు ప్రేక్షకులకు స్పెషల్ ఆఫర్..!
Election Commission: ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధం.. ఎన్నికల కమిషన్!
BMW : BMW భారీ రీకాల్.. 3.31 లక్షల కార్లను వెనక్కి రప్పింపు.. ప్రపంచవ్యాప్తంగా డీలర్లకు!
CM Chandrababu: రాష్ట్రంలోని ఆటో, క్యాబ్ డ్రైవర్లకు గుడ్ న్యూస్..! ఆర్థిక సాయం నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి..!