అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని ఎవరు కోరుకోరు? మంచి దుస్తులు, పర్ఫెక్ట్ మేకప్‌తో పాటు, మన కేశాలంకరణ (Hairstyle) కూడా చాలా ముఖ్యం. కేశాలంకరణ సరిగా లేకపోతే ఎంత రెడీ అయినా ఆ లుక్ పూర్తి కాదు.
అందుకే స్త్రీ అయినా, పురుషుడు అయినా.. జుట్టు పొడవుగా, సిల్కీగా, స్ట్రెయిట్‌గా ఉండాలని ఆశిస్తుంటారు. దీనికోసం చాలా మంది రకరకాల క్రీమ్స్, కాస్మొటిక్స్‌తో పాటు, ముఖ్యంగా హెయిర్ స్ట్రెయిట్‌నర్ (Hair Straightener) వాడుతుంటారు. స్ట్రెయిట్‌నర్‌ను వాడటం వల్ల వెంటనే సిల్కీ, స్ట్రెయిట్ లుక్ వస్తుంది నిజమే. కానీ, దీనిని అతిగా వాడితే మాత్రం భారీ నష్టాన్ని మూటగట్టుకోవాల్సి వస్తుందని లైఫ్ స్టైల్ స్పెషలిస్ట్‌లు, ఆరోగ్య నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు.
హెయిర్ స్ట్రెయిట్‌నర్‌తో వచ్చే సీరియస్ నష్టాలు ఇవే.. రోజువారీ జీవితంలో ఫంక్షన్లకు, ఆఫీసులకు వెళ్లే తొందరలో చాలా మంది స్ట్రెయిట్‌నర్‌ను విపరీతంగా వాడుతుంటారు. కానీ, దీనివల్ల కలిగే కొన్ని సీరియస్ సమస్యలను ఇప్పుడు చూద్దాం.
జుట్టు పొడిబారుతుంది (Dry Hair): హెయిర్ స్ట్రెయిట్‌నర్ ఉపయోగించినప్పుడు వచ్చే అధిక వేడి జుట్టులో ఉండే సహజ తేమను (Natural Moisture) పూర్తిగా తొలగిస్తుంది.
తేమ పోవడం వల్ల జుట్టు నిస్తేజంగా మారి, తీవ్రంగా పొడిబారుతుంది. పొడిబారిన జుట్టు అందవిహీనంగా కనిపిస్తుంది. అందుకే, ప్రతిరోజూ స్ట్రెయిట్‌నర్ వాడొద్దని నిపుణులు సూచిస్తున్నారు.
జుట్టు రాలడం, చిట్లడం (Hair Fall and Split Ends): ప్రతిరోజు స్ట్రెయిట్‌నర్‌ను ఉపయోగించడం వల్ల జుట్టుకు పదేపదే వేడి తగిలి, జుట్టు మూలాలు (Hair Roots) బలహీనపడతాయి.
ఈ బలహీనత క్రమంగా జుట్టు రాలడానికి దారితీస్తుంది. అంతేకాక, జుట్టు చివర్లు చిట్లిపోయి (Split Ends) మరింత నిర్జీవంగా, దెబ్బతిన్నట్లు కనిపిస్తుంది.
తల చర్మంపై ప్రభావం (Scalp Damage): స్ట్రెయిట్‌నర్ వేడి కేవలం జుట్టుకే కాదు, దాని వేడి తల చర్మం (Scalp) పైనా ప్రభావం చూపుతుంది. అధిక వేడి తల చర్మాన్ని పొడిబారేలా చేస్తుంది.
దీని కారణంగా చుండ్రు (Dandruff), దురద (Itching) వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ సమస్యలు తీవ్రంగా మారితే చికిత్స తీసుకోవాల్సి వస్తుంది.
జుట్టు రంగు కోల్పోవడం (Loss of Hair Color): మీరు మీ జుట్టుకు కలర్స్ లేదా డై వాడినట్లయితే, అదే సమయంలో హెయిర్ స్ట్రెయిట్‌నర్ కూడా రోజూ వాడితే, జుట్టు సహజ రంగును వేగంగా కోల్పోయే ప్రమాదం ఉంది. తరచుగా వేడి తగలడం వల్ల జుట్టు సహజ ఆకృతి దెబ్బతిని, రంగు నిలవదు.
జుట్టును కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు: హెయిర్ స్ట్రెయిట్‌నర్ వాడటం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ, సరైన అవగాహన, రక్షణతో వాడటం ముఖ్యం.
హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రే: స్ట్రెయిట్‌నర్ ఉపయోగించే ముందు తప్పనిసరిగా హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రే చేయాలి. ఇది జుట్టుకు, వేడికి మధ్య ఒక రక్షణ పొరలా పనిచేస్తుంది.
డీప్ కండిషనింగ్: వారానికి కనీసం రెండుసార్లు జుట్టుకు డీప్ కండిషనింగ్ చేయాలి. ఇది జుట్టు కోల్పోయిన తేమను తిరిగి అందించి, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.
సహజంగా ఆరనివ్వండి: వీలైనంత వరకు జుట్టును సహజంగా ఆరనివ్వండి. హెయిర్ డ్రయర్స్ వాడకాన్ని తగ్గించండి.
వాడకాన్ని తగ్గించండి: వారానికి ఒకటి లేదా రెండుసార్లు కంటే ఎక్కువసార్లు హెయిర్ స్ట్రెయిట్‌నర్ ఉపయోగించవద్దు. అత్యవసరం అయినప్పుడు మాత్రమే వాడటం ఉత్తమం.
ఈ జాగ్రత్తలు తీసుకుంటే, మీ జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉంటుంది. తక్షణ అందం కోసం జుట్టు ఆరోగ్యాన్ని పణంగా పెట్టకండి అని నిపుణులు కోరుతున్నారు.