భారత్, పాక్ ల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్న వేళ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. పాక్ ను ఎలుకతో, భారత్ ను శేషనాగుతో ఆయన పోల్చారు. పాకిస్థాన్ వక్రబుద్ధిని తిరువళ్లువార్ తిరుక్కురల్ లోని ఓ పద్యంతో విమర్శించారు. తమిళ కవి తిరువళ్లువార్ రచించిన తిరుక్కురల్ గ్రంథంలోని పద్యాన్ని పవన్ తన ట్వీట్ లో ప్రస్తావించారు. ‘‘ఎలుకలన్నీ జేరి సముద్రము వలే ఘోషించినప్పటికీ ఏమి హాని జరుగుతుంది..? శేషనాగు ఒక్క హుంకారం చేయగానే అవన్నీ నశిస్తాయి’’ అని చెప్పారు. తన ట్వీట్ లో ఎస్ 400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థకు సంబంధించిన ఫొటోను జతచేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇది కూడా చదవండి: 22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ రాజకీయాల్లో విషాదం! గుండె పోటుతో కుప్పకూలిన మాజీ ఎంపీ!
మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. సీట్లన్నీ ఏపీ వాళ్లకే.. ఉత్తర్వులు జారీ!
విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..
ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!
వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: