రాష్ట్రంలో మరోసారి నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. కూటమి నేతలు ఎంతగానో ఎదురుచూస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ పై సీఎం చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి వరుసగా నామినేటెడ్ పదవులను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో మరో నామినేటెడ్ పదవుల జాబితాను విడుదల చేసేందుకు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. నేడో రేపో మరో నామినేటెడ్ జాబితాను విడుదల చేసేందుకు సన్నాహాలు సిద్ధమయ్యాయని సమాచారం. గతంలో విడుదల చేసిన జాబితాల్లో అనేక నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం తాజాగా రెండు జాబితాలను విడుదల చేసింది.
ఇప్పటికే 115 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్లను నియమించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో నామినేటెడ్ పదవుల జాబితాను విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారని సమాచారం. వీటితో పాటు మహానాడులోగా మరికొన్ని రాష్ట్ర స్థాయి పదవులతో పాటు దేవాలయాల పాలక మండళ్ల ను నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఆపరేషన్ బుడమేరు: ఎప్పుడు మొదలవుతుంది, ఎలా ఉంటుంది? మంత్రి కీలక అప్‌డేట్!
రాష్ట్రంలో ఇంకా 40 కి పైగా రాష్ట్రస్థాయి కార్పొరేషన్లకు నియామకాలు చేపట్టాల్సి ఉంది. అలాగే 21 ప్రముఖ దేవాల యాలకు పాలక మండళ్ల ను నియమించాల్సి ఉంది. ఒకటి, రెండు రోజుల్లో రాష్ట్ర స్థాయి, దేవాలయాలకు పాలకమండళ్లను ప్రకటించేందుకు ముమ్మరమైన కసరత్తు చేస్తూ జాబితాకు తుది రూపు ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు. ఇక అలాగే రాష్ట్రంలో మొత్తం 218 ఏఎంసిలలో 3 విడతలో 115 మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టులను భర్తీ ఇప్పటికే భర్తీ చేశారు. ఈ కమిటీలకు ఇంకా డైరెక్టర్ పోస్టులను ప్రకటించాల్సి ఉంది. మొత్తం 705 డైరెక్టర్ పోస్టులతో పాటు కొత్తగా మరో 35 నుంచి 49 కి పైగా మార్కెట్ కమిటీలకు చైర్మన్లను నియమించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా మరో పదవుల జాబితా దాదాపు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: పండగలాంటి వార్త.. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..
నామినేటెడ్ దక్కని నేతలకు పార్టీ పదవులు
నామినేటెడ్ పదవులు దక్కని నేతలకు రాష్ట్ర జాతీయ పార్టీ కమిటీల్లో చోటు దక్కనుంది. ఈ మేరకు పార్టీ అధినాయకత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మిగిలిన ఆశావహులకు ఇటు పార్టీలో సముచిత స్థానం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. కష్టపడిన వారందరికీ న్యాయం చేయాలనే ఆలోచనతో పదవుల పంపిణీపై సీఎం చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. అలాగే మరికొందరికి రెండవ టర్మ్ లో పదవులు పంపిణీ చేయాలనే యోచనలో అధినేత చంద్రబాబు ఉన్నారని ముఖ్య నేతలు చెబుతున్నారు. మహానాడు నాటికి పదవుల పంపిణీ దాదాపు పూర్తి అవుతుందని ముఖ్య నేతలు వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: 22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!
ప్రధాని మోడీ కీలక సమావేశం.. ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్! ఎప్పుడు అంటే.?
వైసీపీకి మరో బిగ్ షాక్! కీలక నేత పార్టీకి రాజీనామా!
నమ్మి మోసపోయాను..! కొడాలి నానిపై వైసీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు!
ఏపీకి క్యూ కట్టనున్న కంపెనీలు.. ఎన్నో తెలుసా? నారా లోకేష్ కీలక ప్రకటన!
ఎలుకలన్నీ ఘోషించినా వేస్ట్.. పవన్ కల్యాణ్ ఓ ఆసక్తికర ట్వీట్ వైరల్!
జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడి అరెస్టు!
ఏపీ రాజకీయాల్లో విషాదం! గుండె పోటుతో కుప్పకూలిన మాజీ ఎంపీ!
మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. సీట్లన్నీ ఏపీ వాళ్లకే.. ఉత్తర్వులు జారీ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: