ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల సాధికారత, డిజిటల్ పరంగా మెరుగుదల దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు 9,000 ట్యాబ్‌లను పంపిణీ చేయనుందని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. నెల్లూరులో మెప్మా మహిళలు, అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ట్యాబ్‌ల పంపిణీ ద్వారా మహిళలు డిజిటల్ సేవలకు మరింత చేరువై, స్వయం ఉపాధి, వ్యాపారాల్లోకి ప్రవేశించేందుకు వీలుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు నగర పరిధిలోని 160 మంది మెప్మా రిసోర్స్ పర్సన్‌లకు ఆయన స్వయంగా ట్యాబ్‌లు అందించారు.
ఇది కూడా చదవండి: రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు! ఇక నుంచి ఇలా!
ఈ కార్యక్రమం భాగంగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 60 డిజి లక్ష్మి సెంటర్లు కూడా అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను స్థాపించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు నారాయణ వెల్లడించారు. నెల్లూరులో 1,000 మెప్మా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో శిక్షణ, సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. ఈ ట్యాబ్‌ల పంపిణీతో మహిళలకు టెక్నాలజీకి మరింత పరిచయం అవుతూ, ఆర్థికంగా స్వావలంబన పెరుగుతుందని ఆశిస్తున్నారు.
ఇది కూడా చదవండి: రాజకీయ ఉత్కంఠ! కూటమిలోకి వాసిరెడ్డి ఎంట్రీకి బ్రేకులు! వాట్ నెక్స్ట్!
అదే సమయంలో టిడ్కో ఇళ్లపై కూడా మంత్రి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో విజయదశమి నాటికి టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. ఆదివారం నెల్లూరు నగరంలో పర్యటించిన మంత్రి నారాయణ, 9వ డివిజన్ పరిధిలో గాంధీ పార్కును ప్రారంభించి, గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నో పోలీస్ వెరిఫికేషన్ 3 రోజుల్లో మీ ఇంటికే పాస్ పోర్ట్! పూర్తి వివరాలు ఇవే!
తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!
ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!
మేం ఇంకా బ్రతికే ఉన్నాం.. భయమేస్తుంది! మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లిపోండి!
కేవలం రూ.16కే లావా స్మార్ట్ వాచ్! ఆఫర్ ఎప్పటివరకంటే?
ఇంకో 6 రోజుల్లో రైతుల అకౌంట్లలోకి డబ్బులు! లిస్టులో మీ పేరు వస్తుందో లేదో చెక్ చేసుకోండిలా!
తీవ్ర విషాదం! నదిలో కుప్పకూలిన వంతెన 25 మంది టూరిస్టులు గల్లంతు!
ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!
ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!
మామిడి రైతులకు భరోసా.. మార్కెటింగ్ పై మంత్రి సమీక్ష! సీఎంతో ప్రతిపాదన హామీ!
నిరూపిస్తే రాజీనామా చేస్తా! జగన్‌కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: