ఆంధ్రప్రదేశ్: 2025-26 నాటికి స్త్రీ నిధి ద్వారా రూ.5,700 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. డిజిటల్ ఫైనాన్స్ వైపు మహిళలను ప్రోత్సహించాలని, CIF రుణాలను స్త్రీ నిధి ద్వారానే అందించాలని ఆయన చెప్పారు. విజయవాడలో జరిగిన స్త్రీ నిధి మొదటి త్రైమాసిక సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. అర్హులైన డ్వాక్రా మహిళలకు తక్కువ వడ్డీకే రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వారి అవసరాలకు అనుగుణంగా తక్కువ వడ్డీతో రుణాలు అందించాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో స్త్రీ నిధి నిధులను వేరే వాటికి మళ్లించిన వ్యవహారంపై విచారణ జరపాలని ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గత ఐదేళ్లలో స్త్రీ నిధి రుణాలు దారి మళ్లినట్టు గుర్తించామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్లతో ఆయన మాట్లాడారు. కొందరు సిబ్బంది నిధులను దుర్వినియోగం చేశారని.. ఇలాంటి చర్యలు పేద మహిళల అభివృద్ధికి అడ్డుగా ఉంటాయన్నారు.
ఇది కూడా చదవండి: తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!
గత ప్రభుత్వంలో స్త్రీ నిధి నిధుల మళ్లింపుపై విచారణ చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించానన్నారు. రాష్ట్రస్థాయి కార్యాలయం నుంచి క్షేత్రస్థాయి వరకు జరిగిన అవకతవకలను గుర్తించాలని, బాధ్యులైన అధికారులపై జిల్లా/మండల స్థాయిలో కేసులు నమోదు చేయించాలన్నారు. స్త్రీ నిధి కార్యకలాపాలను డిజిటల్ పద్ధతిలో నిర్వహించాలని.. ఇందులో భాగంగానే స్త్రీ నిధి రికవరీ యాప్‌ను ప్రారంభించామన్నారు. ఈ యాప్‌పై స్వయం సహాయక బృందాల సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ యాప్ ద్వారా సభ్యులు తమ రుణ చెల్లింపులను సులభంగా తెలుసుకోవచ్చు. సీఐఎఫ్ రుణాల మంజూరు, రికవరీ పర్యవేక్షణను ఇకపై స్త్రీ నిధి ద్వారానే చేయాలని మంత్రి పేర్కొన్నారు. సభ్యులు రుణం కోసం దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే మంజూరు చేయాలన్నారు సెర్ప్ సీఈఓ వాకాటి కరుణ. స్త్రీ నిధిని మరింత పటిష్టంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటామని.. ప్రతి 15 రోజులకు స్త్రీ నిధి పనితీరుపై సమీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రతి గ్రామ సంఘం ఈ రుణాలను వినియోగించుకునే విధంగా చూడాలన్నారు.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.3 లక్షలు..కారణం ఇదే!
ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!
సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమా, న్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!
ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?
24 గంటలు టైమిస్తున్నా.. లేదంటే తీవ్ర చర్యలు.. వైసీపీకి లోకేశ్ హెచ్చరిక!
తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ని అడ్డుకున్న పోలీసులు! కార్యకర్తలు సుమారు 300 మంది!
వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...
మహిళలకు భారీ గుడ్ న్యూస్.. కొత్త స్కీమ్ కింద లక్ష రూపాయలు! ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఆ జిల్లా వాసులకు గుడ్ న్యూస్: 10వ తరగతి పాస్ అయితే చాలు.. ఉచిత ట్రైనింగ్‌తో పాటు ఉద్యోగ అవకాశం!
ఆంధ్రప్రదేశ్‌లో మారిన కార్మిక చట్టం.. ఇకనుంచి 10 గంటలు పని చేయాల్సిందే! మహిళలకు రాత్రి షిఫ్ట్‌లలో..
ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఇదే ఆఖరి రోజు! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం!
రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!
ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: