Car Price: పండగ గిఫ్ట్‌ ఇచ్చిన రెనో..! క్విడ్, ట్రైబర్, కైగర్ ధరలు భారీగా డౌన్‌!

'సిటీ ఆఫ్ డెస్టినీ'గా పేరొందిన విశాఖపట్నం పర్యాటక రంగంలో మరో కొత్త మణిని జోడించుకుంది. ఇప్పటికే బీచ్‌లు, తూర్పు కనుమలు, పర్వతాలు, ఆర్కే బీచ్ నుంచి బొర్రా గుహల వరకు ఎన్నో అద్భుతాలను అందిస్తున్న ఈ నగరంలో, ఇప్పుడు కైలాసగిరి వద్ద గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జ్ రూపుదిద్దుకుంది. ఈ ప్రాజెక్ట్‌ను VMRDAతో కలిసి కలకత్తాకు చెందిన RJ సంస్థ ₹7 కోట్ల ఖర్చుతో నిర్మించింది.

Russian oil: రష్యా ఆయిల్ కొనుగోలు చేస్తూనే ఉంటాం.. నిర్మలా సీతారామన్!

అధికారుల సమాచారం ప్రకారం, ఈ గ్లాస్ బ్రిడ్జ్ మరో వారం రోజుల్లో అధికారికంగా ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఒకేసారి 50 మంది వరకు నడవగలిగేలా ప్రత్యేక డిజైన్ చేశారు. సేఫ్టీ స్టాండర్డ్స్, మజ్బూత్ మెటీరియల్స్‌తో నిర్మించడం వల్ల సందర్శకులు ఎలాంటి ఆందోళన లేకుండా ఈ కొత్త అనుభూతిని ఆస్వాదించవచ్చు.

Blood Moon/ Lunar Eclipse: బ్లడ్ మూన్... టోటల్ లూనార్ ఎక్లిప్స్! సెప్టెంబర్ 7-8న లైవ్‌లో చూడాలనుకుంటున్నారా!

ట్రయల్ రన్‌లో పాల్గొన్న కొందరు సందర్శకులు తమ అనుభూతిని పంచుకున్నారు. “అలల నురగలు దూసుకువస్తూ కనిపించడం మైమరపింపజేసింది” అని ఒక యువకుడు అన్నాడు. “తూర్పుకనుమల అందాలు, బీచ్ తీరం, చల్లని గాలులు అనుభవం” అని ఒక కుటుంబం వ్యాఖ్యానించింది.
ఈ మాటలే ఈ గ్లాస్ బ్రిడ్జ్ పర్యాటకులకు ఎంత ప్రత్యేక అనుభూతిని ఇస్తుందో చెబుతున్నాయి.

Usa India: భారత్ అమెరికా సంబంధాలు.. వైరం ముగిసిందా!

విశాఖపట్నం ఎప్పటినుంచో టూరిజం హబ్గా అభివృద్ధి చెందుతోంది. సముద్రతీరపు సౌందర్యం, పర్వతాల హరిత వనాలు, ఆర్కే బీచ్, కైలాసగిరి రోప్‌వే కలిసి దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఈ కొత్త గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జ్ జోడించడం ద్వారా విశాఖ పర్యాటక ఆకర్షణలు మరింతగా పెరుగుతాయని అధికారులు ఆశిస్తున్నారు.

Chandrababu Comments: చంద్రబాబు కోసం కొత్త హెలికాప్టర్.. ఆ ఒక్క కారణంగానే ఈ కీలక నిర్ణయం! అందుకే ఇదంతా..

ఈ బ్రిడ్జ్ కేవలం ఫోటోలు తీసుకోవడానికి కాదు, ఒక ప్రత్యేక అనుభూతి కోసం కూడా సరైన ప్రదేశం. యువతకు థ్రిల్, కుటుంబాలకు సంతోషభరితమైన గడుపు, పిల్లలకు కొత్త అనుభవం, అన్నీ కలిపి ఈ గ్లాస్ స్కైవాక్ ఒక ‘మస్ట్ విజిట్’ డెస్టినేషన్‌గా మారబోతోంది. ఈ కొత్త ఆకర్షణ వల్ల స్థానిక వ్యాపారులు కూడా ఉత్సాహంగా ఉన్నారు. “టూరిస్టులు పెరిగితే హోటళ్లు, రెస్టారెంట్లు, హ్యాండీక్రాఫ్ట్ షాపులు కీ లాభం కలుగుతుంది” అని వ్యాపారులు చెబుతున్నారు.

Hydropower Project: భూటాన్‌లో అదానీ పవర్ భారీ అడుగు..! రూ.6 వేల కోట్లతో 570 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టు!

VMRDA ఇప్పటికే విశాఖలో పర్యాటక రంగ అభివృద్ధికి పలు ప్రాజెక్టులు అమలు చేస్తోంది. గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జ్ ఆ ప్రారంభం మాత్రమే. త్వరలోనే మరిన్ని ఆధునిక సదుపాయాలు, పర్యాటక ప్రాజెక్టులు అందుబాటులోకి రావచ్చని సమాచారం.

Medical Shops: నిరుద్యోగ యువతకు బంగారు అవకాశం..! ప్రభుత్వ సబ్సిడీతో జనరిక్ షాపుల ఏర్పాటు!

విశాఖపట్నం ఇప్పుడు పర్యాటక రంగంలో కొత్త మైలురాయిని చేరుకుంది. కైలాసగిరి వద్ద నిర్మించిన గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జ్ కేవలం ఒక కాంక్రీటు నిర్మాణం కాదు—ప్రకృతి అందాలను దగ్గరగా అనుభవించే వేదిక. ఒకేసారి 50 మంది నడవగలిగే ఈ బ్రిడ్జ్ పర్యాటకులకు కొత్త ఉల్లాసాన్ని, విశాఖకు కొత్త గౌరవాన్ని తెచ్చిపెట్టబోతోంది.

UK: యూకే హోం సెక్రటరీగా చరిత్ర సృష్టించిన మహిళా నేత..! పాకిస్థాన్ సంతతి తొలి ముస్లిం..!
AP Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలాఖరు వరకు వర్షాలు! ప్రజల్లో ఆందోళన..
GST: భవిష్యత్తులో GST 3.0.. నిర్మల ఏం చెప్పారంటే!
Chandrababu Meeting: ఆంధ్రుల ఆశల రెక్క.. చంద్రబాబుతో రైల్వే అధికారుల భేటీ.. రైల్వే జోన్‌పై కీలక నిర్ణయాలు!
Traffice-Free Roads: ట్రాఫిక్ సమస్యలకు చెక్! కొత్తగా మరో రెండు ఫ్లైఓవర్లు! ఎక్కడంటే!
AP Development: ఎట్టకేలకు ఆ రైల్వే స్టేషన్‌లో కొత్తగా ఆరో ప్లాట్‌ఫామ్! ప్రయాణికుల కష్టాలకు చెక్.. ఆ రైళ్లు కూడా ఆగేలా..