దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB)ను భవిష్యత్తులో మూసివేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. యూకే ప్రయాణికులు సహా అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను నగరంలోని రెండవ విమానాశ్రయమైన అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (DWC)కు మళ్లించనున్నారు. ఈ నిర్ణయం, $35 బిలియన్ల పెట్టుబడితో నిర్మించబడుతున్న DWC విస్తరణ పనులు పూర్తయ్యాక అమల్లోకి రానుంది.
ఇప్పటికే UAE ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈ ప్రణాళికను ప్రకటించగా, దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సీఈఓ పాల్ గ్రిఫిత్స్ దీనికి మరింత స్పష్టత ఇచ్చారు. DWCని దశలవారీగా విస్తరిస్తూ, 260 మిలియన్ల వార్షిక ప్రయాణికుల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా మార్చనున్నారు.
ఇది కూడా చదవండి: బడ్జెట్ ట్రావెల్ కు బెస్ట్ డెస్టినేషన్లు! టాప్ 10 దేశాలు ఇవే! రోజుకి కేవలం..
ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే DXB విమానాశ్రయం 2024లో 92.3 మిలియన్ల ప్రయాణికులను ఆతిథ్యం ఇచ్చింది. అయితే, నివాస ప్రాంతాలు, రహదారులతో చుట్టుముట్టబడి ఉండటంతో విస్తరణకు అవకాశం లేకుండా పోయింది. ఈ కారణంగా DXB తన ఆపరేషన్‌లను నెమ్మదిగా తగ్గిస్తూ, దీని పాత్రను ముగించనున్నారు. ఇప్పటికైతే బ్రిటిష్ ఎయిర్వేస్, ఎమిరేట్స్ లాంటి సంస్థలు DXB నుంచి సేవలు కొనసాగించనున్నాయి. అయితే పూర్తిస్థాయి మార్పు రాబోయే దశాబ్దాల్లో అమలవుతుంది. DXB మూసివేసిన తర్వాత, అక్కడి ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ఉపయోగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో వారికి గుడ్ న్యూస్! ప్రభుత్వం కీలక నిర్ణయం!
ఆ పుణ్యక్షేత్రానికి రెండు వందే భారత్ రైళ్లు! రూట్ అండ్ టైమింగ్స్ ఇవే!
ఆధార్ కార్డులో ఈ తప్పులు ఉంటే వాటికి అనర్హులు! వెంటనే సరి చేసుకోండి!
ఆ ఇద్దరు వైసీపీ నేతలకు షాక్ ఇచ్చిన జగన్! పార్టీ నుండి సస్పెన్షన్ వేటు..
కృష్ణంరాజు, కొమ్మినేని వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్.. కఠిన చర్యలు తప్పవు!
చంద్రబాబు కీలక ప్రకటన! తల్లికి వందనం ముహూర్తం ఫిక్స్!
రైతులకు శుభవార్త! తక్కువ వడ్డీతో రూ.3 లక్షల లోన్!
ఏపీకి వస్తోన్న గూగుల్.. అక్కడ 143 ఎకరాల్లో ఏర్పాటు.. ఆ ప్రాంతానికి మహర్దశ!
ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!
ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!
ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.850 కోట్లతో, ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్!
తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. వీళ్ళకు మాత్రమే..! అర్హతలు, డాక్యుమెంట్లు ఇవే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: