ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు డ్రోన్ పోలీసింగ్‌ను సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా రైల్వే ట్రాక్‌లు, నిర్మానుష్య ప్రాంతాలు, నగర శివార్లలో గంజాయి వినియోగం, పేకాట, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే తొలిసారిగా తిరుపతిలో మాట్రిక్స్ ఫోర్ థర్మల్ డ్రోన్‌లను రాత్రి గస్తీ కోసం ఉపయోగిస్తున్నారు. ఈ డ్రోన్ల సహాయంతో అనుమానిత ప్రాంతాలను సులువుగా గుర్తించి, తక్షణమే చర్యలు తీసుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: ఆంజనేయులు కోరికను తిరస్కరించిన అధికారులు.. జైలు నిబంధనల ప్రకారం..
అర్ధరాత్రి దాటిన తర్వాత అనవసరంగా రోడ్లపై తిరిగే వారిని, బైక్‌లతో విన్యాసాలు చేసే యువతను అదుపులోకి తీసుకుంటున్నారు. డ్రోన్ల వినియోగం వల్ల మారుమూల ప్రాంతాలకు సైతం వేగంగా చేరుకొని నిఘా పెట్టడం సులభమైందని, దీనివల్ల పోలీసుల సమయం, శ్రమ ఆదా అవుతోందని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లా కలెక్టర్ సహకారంతో అదనంగా ఐదు డ్రోన్లు సమకూర్చుకున్నామని, ఇవి శాంతి భద్రతల పర్యవేక్షణతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు కూడా ఉపయోగపడుతున్నాయని ఆయన వివరించారు. డ్రోన్ల నిఘాతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిలో భయం నెలకొందని, నగరంలో నేరాల నియంత్రణకు ఇది ఎంతగానో దోహదపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఆ జిల్లాలో క్లోవర్ లీఫ్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీకి దెబ్బ మీద దెబ్బ.. మరో షాక్! ఆ జిల్లాలో ఘోర పరాజయం..
ప్రభుత్వం కీలక నిర్ణయం! అంగన్వాడి టీచర్ల భర్తీకి కొత్త రూల్స్! ఇకనుండి అది తప్పనిసరి!
హైకోర్టు సీరియస్ వార్నింగ్! ఇకపై లక్ష రూపాయల జరిమానా!
సబ్జా గింజలతో ఫుల్ ఆరోగ్యం! ఆ మూడు రకాల సమస్యలకు ఇదే చక్కటి పరిష్కారం!
IPS టు IAS! యూపీఎస్సీ సివిల్స్‌లో 15వ ర్యాంక్‌తో తెలుగు కుర్రోడు!
కేశినేని బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం.. రాజకీయ వైరం మరోసారి తెరపైకి! హీటెక్కిన రాజకీయ వాతావరణం!
ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. ఈ అమ్మాయికి 600/600 మార్క్స్.. ఇదే ఫస్ట్ టైమ్!
ఒంగోలులో తీవ్ర కలకలం.. టీడీపీ నేత హత్యలో రాజకీయ కోణం! వైసీపీ నాయకుడిపై అనుమానం -12 బృందాలతో గాలింపు!
వైసీపీ కి మరో ఊహించని షాక్! కీలక నేతకు రిమాండ్!
ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో అందుబాటులో! మీ ఫలితాన్ని ఇలా తెలుసుకోండి!
ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణ.. అమిత్ షా–చంద్రబాబు భేటీ! రాజ్యసభ స్థానం ఎన్నికకు వారి పేర్లు..!
నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!
వారికి గుడ్‌న్యూస్ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: