ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు-2025 తాజాగా విడుదలైన విషయం తెలిసిందే. రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేశారు. అయితే, ఏపీ టెన్త్ ఫలితాల్లో ఓ సంచలనం నమోదైంది. కాకినాడకు చెందిన నేహాంజని అనే విద్యార్థిని 600 మార్కులకు గాను 600 మార్కులు సాధించి సంచలనం సృష్టించింది. ఆమె కాకినాడలోని ఓ ప్రముఖ ప్రైవేట్ పాఠశాలలో చదివినట్లు సమాచారం. ఇక, ఈ ఫలితాల్లో 81.14 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వీరిలో అబ్బాయిలు 78.31 శాతం, అమ్మాయిలు 84.09 శాతం ఉత్తీర్ణులయ్యారు. అలాగే 1,680 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. 19 స్కూళ్లలో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదు కాగా... పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యధికంగా 93.90 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఆ జిల్లాలో క్లోవర్ లీఫ్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఒంగోలులో తీవ్ర కలకలం.. టీడీపీ నేత హత్యలో రాజకీయ కోణం! వైసీపీ నాయకుడిపై అనుమానం -12 బృందాలతో గాలింపు!
వైసీపీ కి మరో ఊహించని షాక్! కీలక నేతకు రిమాండ్!
ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో అందుబాటులో! మీ ఫలితాన్ని ఇలా తెలుసుకోండి!
ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణ.. అమిత్ షా–చంద్రబాబు భేటీ! రాజ్యసభ స్థానం ఎన్నికకు వారి పేర్లు..!
నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!
వారికి గుడ్‌న్యూస్ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: