రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చినందున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైంది. ఇప్పటికే మెగా డీఎస్సీ ప్రకటన జారీ కాగా, అదే మాదిరిగా ఏపీపీఎస్సీ కూడా పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్ల విడుదలకు సిద్ధమైంది. ఈ ఉద్యోగాల భర్తీకి గత జనవరిలోనే ప్రకటన ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించినప్పటికీ, ఎస్సీ వర్గీకరణ దృష్ట్యా ఆలస్యమైంది. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 866 పోస్టుల భర్తీకి సంబంధించి 18 నోటిఫికేషన్లు ఏపీపీఎస్సీ వద్ద పెండింగ్లో ఉన్నాయి. వాటిలో అటవీ శాఖకు సంబంధించి 814 పోస్టులున్నాయి. అయితే, ఖాళీల వివరాలు పంపిన ప్రభుత్వ శాఖలు.. ఎస్సీ వర్గీకరణకు తగ్గట్లు రోస్టర్ పాయింట్లు ఖరారు చేయాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: వారికి గుడ్​న్యూస్​ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..

ఈ కసరత్తు సత్వరమే చేపడితే నెల రోజుల్లో పూర్తిచేయొచ్చు. ఈ వివరాలు అందిన వెంటనే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల జారీకి చర్యలు తీసుకోనుంది. శాఖల వారీగా భర్తీ చేయనున్న ఉద్యోగాలు..

అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్: 100 (30 పోస్టులు క్యారీ ఫార్వర్డ్)

బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్: 691 (141 క్యారీ ఫార్వర్డ్)

డ్రాఫ్ట్స్ మెన్ గ్రేడ్-2 టెక్నికల్ అసిస్టెంట్: 13

తన్నేదార్: 10