విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు (10th Results) బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ఫలితాలు విడుదల చేస్తారు. ఈ ఫలితాలను https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/, మనమిత్ర వాట్సాప్, లీప్ యాప్‌లోనూ విద్యార్థులు ఫలితాలు చూసుకోవచ్చు. అలాగే వాట్సప్ నంబర్ 9552300009కు హాయ్ అని మెసేజ్ చేసి, విద్యా సేవల ఆప్షన్ ద్వారా ఫలితాలను పీడీఎఫ్ కాపీ రూపంలో పొందవచ్చు. ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్మీడియట్ ఫలితాలు కూడా టెన్త్ ఫలితాలతో పాటే విడుదల చేస్తారు.
ఫలితాలు ఇలా కూడా తెలుసుకోవచ్చు..
విద్యార్థులు తమ మొబైల్ ఫోన్‌లోని వాట్సాప్‌లో 9552300009 నంబర్‌కు "Hi" అని మెసేజ్ చేయాలి. వెంటనే సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ వస్తుంది. అందులో విద్యా సేవలను ఎంచుకోవాలి. అనంతరం SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలను సెలక్ట్ చేయాలి. అక్కడ రోల్ నంబర్‌ను ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలు డిస్‌ప్లే అవుతాయి. ఈ రిజల్ట్ పీడీఎఫ్ (PDF) కాపీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే.. పదో తరగతి రెగ్యులర్ పబ్లిక్ పరీక్షలతో పాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలను సైతం విడుదల చేయనున్నారు. ఈ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఫలితాలను https://apopenschool.ap.gov.in/ వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
కాగా ఈ ఏడాది 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు 6,19,275 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంగ్లిష్ మీడియంకు సంబంధించి 5,64,064 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. తెలుగు మీడియంలో 51,069 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నాలుగు గోడల వెనుక కాదు… జగన్ బయటకు వచ్చి మాట్లాడు! హోంమంత్రి అనిత సవాల్!
స్టాచ్యూ ఆఫ్ యూనిటీ తరహాలో ఎన్టీఆర్ భారీ విగ్రహం! ఆ ప్రాంతంలోనే! ఎన్ని అడుగులంటే..
సమంత చేతిలో నూతన ఉంగరం... రహస్యంగా ఎంగేజ్‌మెంట్! సోషల్ మీడియాలో వైరల్!
వేసవిలో రైల్వే ప్రయాణికులకు ఊరట.. దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన! 30కి పైగా స్పెషల్ ట్రిప్పుల పొడిగింపు!
చంద్రబాబు అమిత్ షా భేటీలో కీలక నిర్ణయం! ఏపీ రాజ్యసభ స్థానం బీజేపీదే! ఎవరంటే?
మన వార్డు - మన ఎమ్మెల్యే కార్యక్రమం.. తక్షణ ఈ చర్యలు తీసుకోవాలని..
చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ గ్రీవెన్స్ కార్యక్రమంలో మార్పులు! ఇక నుంచి ఆ రోజు ఫిర్యాదుల స్వీకరణ!
ఆస్ట్రేలియా విద్యార్థి వీసా విధానంలో సంచలన మార్పులు! ప్రపంచ విద్యార్థులకు షాక్!
ముగిసిన రాజ్ కసిరెడ్డి సిట్ విచారణ! దాదాపు 12 గంటల పాటు.. ఇక అరెస్టుల పర్వం మొదలవుతుందా?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: