జులైలో కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే దీనిపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ నిర్వహించింది. ఈ వారంలో మరోసారి సమావేశమై కొత్త పింఛన్ల మంజూరుపై ప్రభుత్వానికి నివేదించనుంది. ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. కొత్తగా వివిధ కేటగిరీల కింద 6 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారుల ప్రాథమిక అంచనా. ప్రస్తుతం 63.32 లక్షల మందికి పింఛన్ల కోసం రూ.2,722 కోట్లు వెచ్చిస్తున్నారు. కొత్త పించన్లకు నెలకు రూ.250 కోట్ల అదనపు భారం పడనుంది. వైకాపా ప్రభుత్వ హయాంలో ఎన్నికల నాటికి 2.3 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీరిలో చాలామందిని అర్హులుగా తేల్చినా నాడు పింఛన్లు ఇవ్వలేదు. వైకాపా నేతల సిఫారసులతో కొంతమంది అనర్హులను అర్హత కేటగిరీలోకి చేర్చారు.
ఇది కూడా చదవండి: ముంబై నటి కేసులో వైసీపీకి మరో బిగ్ షాక్! ఆ ఐపీఎస్ అధికారి అరెస్టు!
ఇప్పుడు వారందరి నుంచి మళ్లీ దరఖాస్తులు ఆహ్వానించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. వైకాపా ప్రభుత్వంలో దివ్యాంగుల కేటగిరీలో బోగస్ సదరం ధ్రువీకరణ పత్రాలు ఇబ్బడిముబ్బడిగా జారీ అయ్యాయి. ఒక్కో దానికి రూ.30 వేల వరకు వసూలు చేశారు. కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరుకు ముందే వాటిని రీ అసెస్మెంట్ చేయించాలని నిర్ణయించింది. ఇప్పటికే ప్రత్యేక వైద్య బృందాలను నియమించి వాటిని తనిఖీ చేయిస్తోంది. కుటుంబంలో పింఛను తీసుకుంటున్న భర్త మరణిస్తే ఆయన భార్యకు జాప్యం లేకుండా పింఛను (స్పౌజ్ పింఛను) అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. 2023 డిసెంబరు నుంచి స్పౌజ్ కేటగిరీ పింఛను మంజూరు చేయాలని నిర్ణయించింది. మేలో దరఖాస్తులు తీసుకుని జూన్ 1 నుంచి పింఛను అందించనున్నారు. ఈ కేటగిరీలో 89,778 అర్హులుంటారని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఆ జిల్లాలో క్లోవర్ లీఫ్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
తెలుగు చిత్రపరిశ్రమలో సంచలనం.. హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు!
ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. వారందరికీ ఇళ్లు ఇవ్వనున్న ప్రభుత్వం.! దాదాపు 3 లక్షల మందికి..
పదో తగరతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్ పరీక్షల ఫలితాల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..?
లిక్కర్ స్కాం లో జగన్ కు భారీ షాక్! నకిలీ పాస్పోర్టుతో సిట్ అధికారులకు దొరికిపోయిన కసి రెడ్డి!
అమిత్ షాతో చంద్రబాబు భేటీ! ఏపీకి మరో కేంద్ర మంత్రి, రాజ్యసభ సీట్ ఆయనకి ఫిక్స్!
మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటున్న విసా రెడ్డి! ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం!
కసిరెడ్డి కేసులో కీలక మలుపు! రేపు సిట్ ముందు హాజరు! వారికి ఇక మూడిందే!
వైసీపీకి బిగ్ షాక్.. ఆన్‌లైన్ బెట్టింగ్ లో ముఠా గుట్టురట్టు కీలక నేతపై కేసు!
సొంత ఊరిలో మాజీ మంత్రి పరువు పోయిందిగా.. ర్యాలీని రాజకీయం చేయొద్దు.. వెళ్లిపోండి!
జగన్ ఖాతాలో మరో స్కెచ్ రెడీ! 22, 23 తేదీల్లో ప్రకటనలు!
జగన్ కోసమే అలా చేశా..! శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
మంత్రితో పాటు పార్టీ నేతలకు తప్పిన ప్రమాదం! పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే..
ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..? రేసులో 'ఆ నలుగురు' నేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!
వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: