సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఓ ఆసక్తికరమైన విషయమిది. ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ పాన్-వరల్డ్ సినిమా చేస్తున్న మహేష్, గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రాతో కలిసి నటిస్తున్నారు. ఈ హాలీవుడ్ స్థాయి చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో గుంటూరు కారం సినిమాతో భారీ హిట్ అందుకున్న మహేష్, ఇప్పుడు మరో విభిన్నమైన ప్రాజెక్ట్‌కి సిద్ధమవుతున్నారు.
ఇదిలా ఉండగా, ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా మహేష్ బాబు కాలేజీ రోజుల్లోని స్నేహితుల గురించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. కాలేజీ రోజులలో మహేష్ బాబు బెస్ట్ ఫ్రెండ్‌గా ఉన్నది త్రిష. ఇద్దరూ చెన్నైలో ఒకే కాలేజీలో చదువుకున్నారు. ఈ విషయం త్రిష స్వయంగా వెల్లడించింది. ఇద్దరికీ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉండటంతో పరిచయం ఏర్పడిందని చెప్పింది. అప్పట్లో ఇద్దరూ హీరో, హీరోయిన్‌గా మారతామని ఊహించలేదు కానీ, ఇప్పుడు ఇండస్ట్రీలో ఇద్దరూ సూపర్‌స్టార్స్.
మహేష్ బాబుతో త్రిష "అతడు", "సైనికుడు" వంటి హిట్ సినిమాల్లో కలిసి నటించింది. ప్రస్తుతం త్రిషకి ఇండస్ట్రీలో ఫేవరేట్ హీరో అంటే అది మహేష్ బాబేనని ఆమె ఓ ఇంటర్వ్యూలో పేర్కొనడం విశేషం. కాలేజీ స్నేహం నుంచి సినిమా మిత్రత్వంగా మారిన వీరి బంధం, అభిమానుల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.