వీకెండ్ స్పెషల్ ఒడియా డల్మా కావలసిన పదార్థాలు: * 3 కప్పుల తూర్ దాల్ (కందిపప్పు). * 1 అరటి పండు, 1 బే లీఫ్. * 1 టీస్పూన్ పసుపు, కొద్దిగా కారం పొడి. * 2–3 కప్పుల నీరు. * 2 వంకాయలు. * తగినంత ఉప్పు. * 1 టమోటా, కొద్దిగా మునగకాయ ముక్కలు. * 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర ఆకులు. * 1 ఉల్లిపాయ, 1 బంగాళదుంప. * 10-12 బీన్స్. * 1/2 కప్పు గుమ్మడికాయ ముక్కలు. * 2 టేబుల్ స్పూన్లు ఆవాల నూనె. * 1 టేబుల్ స్పూన్ పంచ్ ఫోరన్. * 1 టీస్పూన్ జీలకర్ర
తయారీ విధానం. Step 1:ముందుగా కందిపప్పును నానబెట్టి ఉప్పు, పసుపు, ఒక టేబుల్ స్పూన్ ఆవాల నూనె కలిపి 2 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్‌లో ఉడికించండి. Step 2:ఇంకొంత ఆవాల నూనెను పాన్‌లో వేడి చేసి, అందులో జీలకర్ర, పసుపు వేసి తర్వాత అన్ని కూరగాయల ముక్కలూ వేసి వేయించండి.
Step 3:కూరగాయలు సగం ఉడికిన తర్వాత మిగతా మసాలా పొడులు, ముందుగా ఉడికిన పప్పును కూడా వేసి కలపండి. Step 4:తగినంత ఉప్పు, అవసరమైనంత నీరు వేసి కలుపుకుని ముద్దగా వచ్చేలా consistency సెట్ చేసుకోండి.
Step 5:దాన్ని సిమ్‌లో 10 నిమిషాల పాటు మరిగించండి. Step 6:కొత్తిమీరతో అలంకరించి వేడి వేడి అన్నం మీద పోసి సర్వ్ చేయండి!