TTD Updates: శ్రీవారి ఆలయంలో దర్శనం ప్రారంభం.. ముగిసిన చంద్ర గ్రహణం!
TTD Updates: శ్రీవారి ఆలయంలో మంగళవారం రాత్రి 8 గంటల నుండి భక్తులకు దర్శనం ప్రారంభమైంది. మధ్యాహ్నం 3.26 నుండి సాయంత్రం 6.47 గంటల వరకు చంద్ర గ్రహణం ఉన్న కారణంగా ముందుగా నిర్ణయించిన ప్రకారం ఉదయం 9 గంటలకు ఆలయ తలుపులు మూశారు.
- రాత్రి 8.30 నుండి యధావిధిగా అన్నప్రసాద వితరణ…
TTD Updates: శ్రీవారి ఆలయంలో మంగళవారం రాత్రి 8 గంటల నుండి భక్తులకు దర్శనం ప్రారంభమైంది. మధ్యాహ్నం 3.26 నుండి సాయంత్రం 6.47 గంటల వరకు చంద్ర గ్రహణం ఉన్న కారణంగా ముందుగా నిర్ణయించిన ప్రకారం ఉదయం 9 గంటలకు ఆలయ తలుపులు మూశారు.
దాదాపు 10.30 గంటల అనంతరం మంగళవారం రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచారు. ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం, కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.
అన్నప్రసాద వితరణ ప్రారంభం
చంద్ర గ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 9 గంటలకు మూసివేసిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్సును 7.30 గంటలకు తెరిచారు. వంటశాల శుద్ధి అనంతరం రాత్రి 8.30 గంటల నుండి భక్తులకు అన్నప్రసాద వితరణ ప్రారంభమైంది. అదే విధంగా లడ్డు కౌంటర్లు కూడా పునః ప్రారంభమయ్యాయి.
వైభవంగా కుమార ధార తీర్థ ముక్కోటి
తిరుమలలో మంగళవారం కుమార ధార తీర్థ ముక్కోటి వైభవంగా నిర్వహించారు. చంద్ర గ్రహణం కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులను తీర్థానికి అనుమతించారు. శ్రీవారి సేవకుల సహకారంతో టీటీడీ అన్న ప్రసాద విభాగం సిబ్బంది పాపవినాశనం డ్యామ్ వద్ద భక్తులకు అల్పాహారం, పాలు, మంచినీరు పంచిపెట్టారు. వివిధ విభాగాల అధికారులు ఏర్పాట్లను పర్యావేక్షించారు.
Be the first to react