తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వివాదం కొనసాగుతోంది. కొలికపూడి తీరు పైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే వరుస వివాదాలతో కొలికపూడి పార్టీలో ఒక వర్గానికి దూరం అయ్యారు. నియోజకవర్గంలో మరో వర్గ నేతలు ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని పదే పదే డిమాండ్ చేస్తోంది. తాజాగా ప్రత్యేకంగా సమావేశమై తీర్మానం చేసారు. ఇక, ఇప్పుడు సీఎం చంద్రబాబు నందిగామ పర్యటన వేళ కొలికపూడికి తన మార్క్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు.
చంద్రబాబు పర్యటన వేళ
టీడీపీలో ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. కొలికపూడి వ్యవహర శైలితో ఇబ్బందులు పడుతున్న తిరువూరు టీడీపీ నేతలు ఆయనపై తిరుగుబాటు జెండా ఎగరవేశారు. ఇటీవల కొలికపూడికి వ్యతిరేకంగా ఏపీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్ ఆధ్వర్యంలో నాలుగు మండలాల నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే తీరుపై టీడీపీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి నేతలకు ఎమ్మెల్యే గుర్తింపు, గౌరవం ఇవ్వడం లేదని వాపోయారు. ఎమ్మెల్యేకు ఉన్న అధికారులు కట్టడి చేసి పార్టీ ఇన్‌చార్జ్‌గా మరొకరికి అవకాశం ఇవ్వాలని తీర్మానించారు. ఎమ్మెల్యే కొలికపూడిపై పార్టీ అధిష్టానం కూడా సీరియస్ అయింది.
ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్! పార్టీని విడిచిపోతున్న కీలక నేత!
వరుస వివాదాలతో
ఎమ్మెల్యే కొలికపూడి ఈ మధ్య కాలంలో తన నియోజకవర్గంతో ఎస్టీ మహిళల ఫిర్యాదు మేరకు 48 గంటల్లో ఏఎంసీ మాజీ చైర్మన్ రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే తాను పార్టీకి రాజీనామా చేస్తానంటూ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేసారు. దీనిని పార్టీ నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. కొలికపూడి వ్యవహార శైలి, కొలికపూడిలో జరుగుతున్న పరిస్థితులపై నివేదిక ఇవ్వాల్సిందిగా నెట్టెం రఘురాం, ఎంపీ కేశినేని, మంతెన సత్యనారాయణను అధిష్టానం ఆదేశించింది. దీంతో తిరువూరులో పర్యటించిన ముగ్గురు కమిటి సభ్యులు తిరువూరులో జరుగుతున్న పరిణామాలు, పార్టీ నేతల అభిప్రాయాలు, కొలికపూడిపై వస్తున్న ఆరోపణలపై నివేదికను సిద్దం చేసారు. ఇదే సమయంలో ఈ రోజు చంద్రబాబు నందిగామ పర్యటనకు వెళ్లిన సమయంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.
చంద్రబాబు సీరియస్
నందిగామ పర్యటనలో తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుని చంద్రబాబు పట్టించుకోలేదు. అక్కడ హెలికాప్టర్ దిగి, నేతలను పరిచయం చేసుకున్న సందర్భంలో.. కొలికపూడి వైపు సీరియస్ గా ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అందరి నేతలతో కరచాలనం చేసిన చంద్రబాబు ... కానీ కొలికిపూడితో కరచాలనం చేయడానికి ఇష్టపడనట్లు కనిపించింది. దీంతో, చంద్రబాబు పార్టీ నేతలతో మాట్లాడుతున్న సమయంలో ఒంటరిగా కొలికపూడి చేసేది లేక .. వెనక్కి వెళ్లి నిలబడ్డారు. ఆ తరువాత అక్కడ నుంచి వెళ్లిపోయారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే తీరు మారకుంటే కొత్త ఇంఛార్జ్ కి బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం సాగుతోంది. దీంతో, త్వరలోనే కొలికపూడి వివాదానికి మగింపు పలికే అవకాశం ఉందని చెబుతున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆ కీలక ప్రాజెక్టుకు వీడనున్న సంకెళ్లు! మంత్రి సంచలన నిర్ణయం!
వివేక హత్య వెనుక మర్మం! అసలు వ్యక్తి మొదట అక్కడే! ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..
రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..
రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..
ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..
తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!
సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.? ఈ కేసులో కీలక పరిణామం..!
మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: