తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2024 పట్ల సినీ ప్రముఖుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అగ్ర కథానాయకుడు చిరంజీవి ఈ అవార్డుల ప్రకటనపై తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. గురువారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. సినిమా అవార్డుల సంప్రదాయాన్ని తిరిగి ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవి తన సందేశంలో, "గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్‌కు ఎంపికైన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు నిజంగా ఎంతో విలువైనది.
కన్నీటి గాధ! ఉద్యోగాల కోసం వెళ్లి మయన్మార్ లో చిక్కుకున్న భారతీయులకు చిత్రహింసలు!
సృజనాత్మక రంగంలో ఉన్న ప్రతి నటుడికి, సాంకేతిక నిపుణుడికి ఇది ఎంతో ప్రేరణనిస్తుంది" అని పేర్కొన్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ అవార్డుల సంప్రదాయాన్ని తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించడం గొప్ప ప్రోత్సాహాన్ని అందిస్తుందని తెలిపారు. ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, సంబంధిత శాఖ మంత్రులకు, అధికారులకు, అవార్డుల కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. చిరంజీవితో పాటు అగ్ర కథానాయకులు అల్లు అర్జున్, ఎన్టీఆర్ కూడా గద్దర్ అవార్డుల ప్రకటనపై తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కాగా, జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతి వంటి అంశాలపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా 'కమిటీ కుర్రోళ్లు' చిత్రం అవార్డును దక్కించుకుంది. ఈ చిత్రం నిర్మాత నిహారిక కొణిదెల, చిత్ర బృందం కూడా ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కళారంగానికి ఇస్తున్న ఈ ప్రోత్సాహం భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు రావడానికి దోహదపడుతుందని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమెరికాలో భారతీయులు మృతి.. అందుకు కారకులకు జైలు శిక్ష! భారీ మంచు తుఫాన్..
మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన! దెబ్బకు అంతా సైలెంట్!
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ధరలు పెంపు! క్వార్టర్‌కు రూ.6 నుండి రూ.30 వరకు..
14 ఏళ్ల తర్వాత తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రకటన.. ఉత్తమ నటుడిగా.. విజేతలు వీరే.!
ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు, మరో కొత్త పథకం!
వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వ్యక్తిపై దాడి కేసు.. 3 రోజుల పోలీసు కస్టడీకి మాజీ ఎంపీ!
లోకేష్క కీలక పదవి.. మహానాడులో ప్రతిపాదన.. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే!
ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. తారక్ ఎమోషనల్ పోస్ట్!
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర..! తులం ఎంతంటే…?
కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?
ఊహించని ధరకు మోటో నుంచి ఎడ్జ్ 60 స్టైలస్.. ఫీచర్లు ఇవే! తమ్ముళ్లు డబ్బు రెడీ చేసుకోండి..
టీడీపీ జెండా.. తెలుగు జాతికి అండ! వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు.. యువగళం పేరుతో..
ఏం అదృష్టం సార్..! అడ్డిమార్ గుడ్డిదెబ్బ కొడితే.. రూ. 231 కోట్ల జాక్ పాట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: