తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా తెలుగు ప్రజలు ఆయనను ఘనంగా స్మరించుకుంటున్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు, పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఎన్టీఆర్ సమాధి వద్ద ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్ రామ్ ప్రత్యేక పూజలు చేసి, పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తన తాతను స్మరించుకుంటూ ఎక్స్ వేదికగా ఓ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. "మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా. సదా మీ ప్రేమకు బానిసను" అంటూ జూనియర్ ఎన్టీఆర్ రాసుకొచ్చారు. ఈ పోస్ట్ పలువురి హృదయాలను తాకిందని, అభిమానులు "జోహార్ ఎన్టీఆర్" అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర..! తులం ఎంతంటే…?
కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?
ఊహించని ధరకు మోటో నుంచి ఎడ్జ్ 60 స్టైలస్.. ఫీచర్లు ఇవే! తమ్ముళ్లు డబ్బు రెడీ చేసుకోండి..
టీడీపీ జెండా.. తెలుగు జాతికి అండ! వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు.. యువగళం పేరుతో..
ఏం అదృష్టం సార్..! అడ్డిమార్ గుడ్డిదెబ్బ కొడితే.. రూ. 231 కోట్ల జాక్ పాట్!
ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!
లోకేశ్‌కు పార్టీలో ఆ పదవి.. జోరుగా చర్చ! జీవీ, ఆనం కీలక వ్యాఖ్యలు!
వల్లభనేని వంశీకి దెబ్బపై దెబ్బ.. బెయిల్ పిటిషన్ కొట్టివేత!
అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి షాక్! 14 రోజుల రిమాండ్..
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ జిల్లా పేరు మారుస్తూ జీవో జారీ!
వైసీపీకి మరో భారీ షాక్! ఏపీ పోలీసుల అదుపులో మాజీ మంత్రి!
కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్! రాష్ట్రానికి మరో 2 లక్షల కనెక్షన్లు!
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జూన్ 2న కీలక ప్రకటనలు! కొత్త ఆరోగ్య పథకం..
ఏపీ పంట పండింది... కొత్తగా 2 రైల్వే లైన్లు! ఆ రూట్లోనే..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: