ఉద్యోగం పేరుతో విదేశాలకు వెళ్లే భారతీయ యువతను లక్ష్యంగా చేసుకుంటూ మోసపూరిత నకిలీ సంస్థలు ఎలా అమానుషంగా ప్రవర్తిస్తున్నాయో తెలియజేసే దారుణ ఉదంతమిది. మయన్మార్‌లోని కొన్ని నకిలీ ఐటీ కంపెనీలు భారతీయులను బోనులో వేసి, బలవంతంగా ఆన్‌లైన్ మోసాలకు పాల్పడేలా చేస్తున్నాయి. టార్గెట్లు తీరకపోయినా, వారి ఆదేశాలు పాటించకపోయినా బాధితులకు అమానుషంగా చిత్రహింసలు పెట్టారు. వారానికి పైగా ఫ్రిజ్‌లో ఉంచిన కుళ్లిన బాతు గుడ్లను బలవంతంగా తినిపించడం, నిరాకరించిన వారికి కరెంట్ షాకులు ఇవ్వడం వంటి పాశవిక చర్యలకు పాల్పడ్డారు. బాధితుల గోడును తెలుసుకున్న భారత ప్రభుత్వం ప్రత్యేక చర్యగా మార్చి నెలలో 540 మంది భారతీయులను మయన్మార్ నుంచి రక్షించి స్వదేశానికి తీసుకొచ్చింది. వీరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలవారు ఉన్నారు.
ఈ బాధితుల్లో కరీంనగర్ జిల్లా రంగంపేటకు చెందిన కొక్కిరాల మధుకర్ రెడ్డి తన అనుభవాన్ని ఓ జాతీయ మీడియాలో పంచుకున్నారు. 2024 డిసెంబర్‌లో బ్యాంకాక్‌కు వెళ్లిన తనను, అక్కడి నుంచి ఐటీ ఉద్యోగం పేరుతో మయన్మార్‌లోని మయావడికి అక్రమంగా తరలించారని చెప్పారు. అక్కడ శిక్షణ సమయంలో అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులను మోసం చేయించేందుకు తమను ఉపయోగిస్తున్నారని తెలుస్తుందని తెలిపారు. టార్గెట్లు తీరకపోవడంతో తనపై చిత్రహింసలు పెట్టారని చెప్పారు. rotten గుడ్లను తినించడమే కాకుండా, 20 లీటర్ల నీటి డబ్బాలు పట్టించడం, గంటల తరబడి ఎండలో నిలబెట్టడం వంటి శిక్షలు విధించారని వివరించారు. మహిళలు కూడా ఈ పాశవికతకు బలి అయ్యారని చెప్పారు. చివరికి 65 మంది భారతీయులు నిరసన చేపట్టిన తర్వాత మయన్మార్ పోలీసులు స్పందించి భారత అధికారులకు సమాచారం అందించడంతో, బాధితులను రక్షించారు. ఈ భయంకర అనుభవాన్ని పంచుకోవడం వల్ల భవిష్యత్తులో ఇతరులు ఇలా మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని మధుకర్ రెడ్డి హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: ఏపీలో తల్లికి వందనం పథకం..! ఈ చిన్న పని చేయకపోతే రూ.15వేలు కట్, తెలుసుకోండి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సీనియర్ నటుడు కన్నుమూత! 150కి పైగా సినిమాల్లో..
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ధరలు పెంపు! క్వార్టర్‌కు రూ.6 నుండి రూ.30 వరకు..
కవిత ఘాటు వ్యాఖ్యలు! ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తారా?
మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన! దెబ్బకు అంతా సైలెంట్!
వారికి తక్కువ వడ్డీకే రూ. 3 లక్షలు! ఇది మీకు తెలుసా?
ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు, మరో కొత్త పథకం!
ఏపీలో వారందరికీ కొత్త పింఛన్లు! జూన్ నుండే రూ.4 వేలు .. డేట్ ఫిక్స్!
ఏపీలో తల్లికి వందనం పథకం..! ఈ చిన్న పని చేయకపోతే రూ.15వేలు కట్, తెలుసుకోండి!
అన్నదాత సుఖీభవ పథకం.. ఎవరు అర్హులు! ఎలా దరఖాస్తు చేసుకోవాలి!
ఏపీలోని ఆ రెండు నగరాలకు పండగే! 95 ఎలక్ట్రిక్ బస్సులు, తీరనున్న కష్టాలు!
కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: