సీఎం చంద్రబాబు ఓ నిరుపేద కుటుంబానికి ఇల్లు కట్టించి ఇస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో సీఎం చంద్రబాబు గత ఏడాది జులై ఒకటో తేదీన 'ఎన్టీఆర్ భరోసా పింఛన్ల' పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ సందర్భంగా స్థానిక సుగాలి కాలనీలో ఉన్న బాణావత్ పాములు నాయక్, సీతమ్మ నాయక్ దంపతుల ఇంటికి వెళ్లి తొలి పింఛన్లు అందజేసి.. యోగక్షేమాలను తెలుసుకున్నారు. పూరింట్లో ఉంటున్న తాము వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు సీఎం వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. వారి కష్టానికి చలించిన చంద్రబాబు ఇల్లు కట్టించి ఇస్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే ఏడాది తిరగక ముందే రూ.12 లక్షల వ్యయంతో డాబా నిర్మించి ఇచ్చారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.1.80 లక్షలు మంజూరు చేయగా.. మిగిలిన నగదును విద్య, ఇటీ శాఖల మంత్రి నారా లోకేశ్, తెదేపా మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కొల్లి శేషు సహకారంతో సమకూర్చి నిర్మాణం పూర్తి చేశారు. బుధవారం ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, కొల్లి శేషు, భాజపా నియోజకవర్గ ఇన్ఛార్జి పంచుమర్తి ప్రసాద్ సంయుక్తంగా ప్రారంభించారు. అనంతరం పాములు నాయక్ దంపతులు పూరి గెడిసె నుంచి కొత్త ఇంట్లోకి మారారు. 'సీఎం స్వయంగా మా కష్టం తెలుసుకుని ఇంటిని నిర్మించి ఇచ్చారు. ఆయనకు, మంత్రి లోకేశ్కు రుణపడి ఉంటాం' అని పాములు నాయక్ దంపతులు తెలిపారు.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కొత్త మంత్రులకు శాఖలు ఖరారు.. మరి కాసేపట్లో ఉత్తర్వులు! రేపే బాధ్యతల స్వీకరణ!
సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..
పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులు, నటీనటులు, అభిమానులు ఆవేదన వ్యక్తం
12న కూటమి భారీ బహిరంగ సభ.. వచ్చే నాలుగేళ్ల పాలనకు..
ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.7 వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!
రైతులకు ప్రభుత్వం ఉచితంగా రూ.70 వేలు.. ఎలా పొందాలి? ఎవరికి వస్తాయి?, అర్హతలు ఇవే!
పండగలాంటి వార్త.. ఆ రైల్వే స్టేషన్ కు ఆరు కొత్త రైల్వే లైన్లు! ఇక వారికి పండగే.. వేళల్లో ఉద్యోగాలు!
సజ్జలకు ఊహించని షాక్.. వెంటనే చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు!
బాలయ్యకు చంద్రబాబు బర్త్‌డే విషెస్! సోషల్ మీడియా వేదికగా..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: