పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. మంగళవారం ఈ రెండు జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
ప్రతి స్థానానికి 11 మంది చొప్పున మొత్తం 22 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కఠినమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
డీఐజీ కోయ ప్రవీణ్ స్వయంగా పులివెందులలో శిబిరం వేసి భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు. రెండు మండలాల కీలక ప్రాంతాల్లో, జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను కఠినంగా తనిఖీ చేస్తున్నారు.
పోలింగ్ ముగిసే వరకు స్థానికేతరులు ఆ ప్రాంతాల్లో ఉండరాదని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.