ఉత్తరప్రదేశ్‌లోని నొయిడా ప్రాంతంలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. దీపక్ అనే 20 ఏళ్ల కుర్రాడు ఒక్కరోజులోనే అంబానీలను మించిన సంపదదారి అయ్యాడు. ఈ ఘటన నొయిడా డాంకౌర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సంచలనం రేపింది.
ఇందుకు కారణం... దీపక్ తల్లి గాయత్రీ దేవి పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతాలో ఒక్కసారిగా రూ. 1,13,56,000 కోట్లు జమ అయినట్లు మెసేజ్ రావడం. రెండు నెలల క్రితం గాయత్రీ దేవి మరణించగా, ఆమె ఖాతాలో అంత భారీ మొత్తం జమ అయినట్లు వచ్చిన సందేశం చూసిన దీపక్, ఆశ్చర్యంతో షాక్‌కు గురయ్యాడు.
ఆ మెసేజ్ చూసిన వెంటనే నిద్ర మత్తు వదిలి, బాంద్లాగా బ్యాంకుకు పరుగెత్తాడు. బ్యాంక్ అధికారులకు విషయం చెప్పగానే వారు కూడా షాకయ్యారు. వెంటనే తాము స్పందించి ఆ ఖాతాను తాత్కాలికంగా ఫ్రీజ్ చేశారు. ఇది ఒక టెక్నికల్ లోపమా? లేక మనీ లాండరింగ్, హవాలా లాంటి ఏదైనా ఆర్థిక మోసమా అన్న కోణంలో ఇప్పుడు విచారణ సాగుతోంది.
ఈ ఘటనపై ఆదాయపు పన్ను శాఖ (IT Department) దర్యాప్తు ప్రారంభించింది. డిజిటల్ వ్యవస్థల్లో ఎక్కడ లోపం జరిగిందా? లేకా మోసపూరిత లావాదేవీలకు భాగమా అన్నది త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఘటన స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.