అందరూ జీవితంలో వారసుల కోసం ప్రాపర్టీలు, డబ్బు, ల్యాండ్‌లు సంపాదిస్తారు. ఇంతటితో పని అయిపోయినట్లు కాదు. ప్రాపర్టీలను ప్రొటెక్ట్ చేయడానికి, సరైన వ్యక్తుల చేతికి వెళ్లడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకు తగిన జాగ్రత్తలతో వీలునామా (Will) రాయడం కీలకం. వీలునామా రాసేటప్పుడు ఏవైనా మిస్టేక్స్ చేస్తే చాలా సమస్యలు ఎదురుకావచ్చు. ఇవి వివాదాలు, జాప్యాలు, చట్టపరమైన సమస్యలకు దారితీస్తాయి. వీలునామా రేసేటప్పుడు అందరూ చేసే కామన్ మిస్టేక్స్, వాటిని ఎలా అవాయిడ్ చేయాలో చూద్దాం. కనీసం ఇద్దరు సాక్షుల సమక్షంలో వీలునామాపై సంతకం చేయాలి. వీలునామా రాసిన వ్యక్తి (టెస్టేటర్ అని పిలుస్తారు), ఇద్దరు సాక్షులు కలిపి ముగ్గురూ వీలునామాపై సంతకం చేసేటప్పుడు హాజరు కావాలి. వీలునామాపై ఒంటరిగా సంతకం చేసి, సాక్షులు తర్వాత సంతకం చేస్తే, అది చెల్లదని ప్రకటించవచ్చు. అందుకే మీరు స్పష్టమైన మానసిక స్థితిలో ఉన్నారని, ఇష్టపూర్వకంగా వీలునామా రాశారని తర్వాత నిర్ధారించగల ఇద్దరు వ్యక్తుల సమక్షంలో వీలునామాపై సంతకం చేయండి. వృద్ధులు అయితే వీలునామాపై సంతకం చేసేటప్పుడు వారు మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపే మెడికల్ సర్టిఫికెట్ జతచేయడం మంచిది. వీలునామా రాసేటప్పుడు చాలా మంది చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే, లబ్దిదారుడిని (వీలునామా నుంచి ప్రయోజనం పొందే వ్యక్తి) సాక్షిగా సంతకం చేయడానికి అనుమతించడం. భారతీయ చట్టం ప్రకారం, ఇలా కుదరదు.
ఇది కూడా చదవండి: లారీని ఢీ కొట్టిన కారు.. ముగ్గురు మృతి - మరో ఇద్దరికి తీవ్ర గాయాలు!
ఒక లబ్ధిదారుడు వీలునామాపై సాక్షిగా సంతకం చేస్తే, వారు వీలునామా నుంచి ప్రయోజనాలు పొందే హక్కును కోల్పోవచ్చు. అందుకే వీలునామాలో లబ్ధిదారులుగా పేర్కొననని వ్యక్తులను సాక్షులుగా సెలక్ట్ చేసుకోండి. సాక్షి వీలునామా నుంచి ప్రయోజనం పొందలేరు కానీ అవసరమైతే ఎగ్జిక్యూటర్ (వీలునామా అమలు చేసే వ్యక్తి)గా ఉండవచ్చు. ప్రతి వ్యక్తికి ఏం లభిస్తుంది, ఏం చెందాలనే అంశాలను వీలునామా స్పష్టంగా పేర్కొనాలి. భాష అస్పష్టంగా ఉంటే, అది కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు, తగాదాలకు దారితీయవచ్చు. వీలునామా రాసేటప్పుడు సింపుల్‌గా అందరికీ అర్థమయ్యే భాషనే ఉపయోగించండి. ఉదాహరణకు మై ప్రాపర్టీ అని రాయకుండా, అడ్రస్ స్పష్టంగా పేర్కొనండి. ఆభరణాలు ఇస్తుంటే, ప్రతి వస్తువును వివరంగా వివరించండి. షేర్డ్ లేదా జాయింట్ ప్రాపర్టీల గురించి సరిగ్గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అలాగే తాజా వీలునామా మాత్రమే ఎప్పుడూ పరిగణనలోకి తీసుకుంటారు. మీరు కొత్త వీలునామా రాస్తే, కొత్తది పాతదానితో పాటు పనిచేయాలని మీరు కోరుకుంటే తప్ప, పాతవి పని చేయవు. అలాంటప్పుడు మొదటి నుంచి కొత్తగా ప్రారంభించకుండా వీలునామా అప్‌డేట్ చేయడానికి కోడిసిల్ (వీలునామాకు అధికారిక సవరణ) ఉపయోగించండి.
ఇది కూడా చదవండి: ఎలక్ట్రిక్ కార్ వచ్చేసిందోచ్! తక్కువ ధర.. ఎక్కువ ఫీచర్లతో... మారుతి ఆల్టో 800!
జీవితంలో వచ్చే మార్పులు, వివాహాలు, జననాలు, మరణాలు లేదా కొత్త ఆస్తులను కొనడం వంటి కారణాలతో తరచూ వీలునామా అప్‌డేట్ చేయాలి. వీలునామాలో ఈ మార్పులు చేయకపోతే గందరగోళానికి కారణమవుతుంది. అందుకే వీలునామాను క్రమం తప్పకుండా సమీక్షించండి, కోడిసిల్స్ ద్వారా లేదా అవసరమైనప్పుడు కొత్త వీలునామా రాయడం ద్వారా అప్‌డేట్స్ చేయండి. వీలునామా రాయడం అనేది సింపుల్‌గా అనిపించవచ్చు, కానీ చిన్న తప్పులు పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. వీలునామా సరిగ్గా రాయడానికి, అన్ని చట్టపరమైన అవసరాలకు అనుగుణంగా ఉందని నిర్ధారించుకోవడానికి నిపుణుల సహాయం తీసుకోండి. ఒక వీలునామాను చట్టం ప్రకారం రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు. కానీ దాన్ని రిజిస్టర్ లేదా నోటరీ చేయడం చట్టపరమైన బలాన్ని అందిస్తుంది. సరైన అథెంటికేషన్ లేకపోతే, ఎవరైనా వీలునామా నకిలీదని లేదా ఒత్తిడిలో రాయించి, సంతకం చేయించారని కోర్టులో కేసు వేయవచ్చు. అందుకే అథెంటిసిటీ నిర్ధారించడానికి వీలునామాను రిజిస్టర్ చేయండి లేదా నోటరీ చేయండి.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!
వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?
ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!
లోకేశ్ తాజాగా కీలక సూచనలు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!
మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: