National Highway: ఏపీలో కొత్తగా మరో నేషనల్ హైవే! నాలుగు లైన్లుగా... రూ.3,653 కోట్లతో! రూట్ ఇదే!

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం బ్రాండ్ల ప్రవేశానికి అడ్డుకట్ట పడింది. ఎక్సైజ్ శాఖ ఇప్పటికే ప్రభుత్వానికి కొత్త బ్రాండ్లను అనుమతించాలంటూ ప్రతిపాదనలు సమర్పించినప్పటికీ, సీఎం చంద్రబాబు వాటిని తిరస్కరించినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న బ్రాండ్లతోనే కొనసాగాలని స్పష్టంగా తెలియజేశారు. రాష్ట్రంలో కొత్తగా మద్యం బ్రాండ్ల ప్రవేశం అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

Special Trains: నర్సాపూర్ నుండి బెంగళూరుకు ప్రత్యేక రైళ్ళు! హాల్ స్టేషన్ లో ఇవే!

సమీప కాలంలో ఎక్సైజ్ శాఖ కొత్తగా ప్రతిపాదించిన బ్రాండ్లలో చాలావరకు ఇప్పటికే ఉన్న వాటికి దగ్గరగా వినిపించే పేర్లే ఉన్నాయని తెలుస్తోంది. కేవలం పేర్లలో స్వల్ప మార్పులు చేసి మార్కెట్‌లోకి తేవాలని కొన్ని కంపెనీలు ప్రయత్నించాయి. అయితే ఇవి నిజానికి కొత్త ఉత్పత్తులుగా పరిగణించబడతాయి. వాటికి వేరే ధరలు నిర్ణయించాల్సి వస్తుంది. ఇలాంటి ప్రతిపాదనలు అనుమతిస్తే గత ప్రభుత్వంలోని పొరపాట్లను మళ్లీ పునరావృతం చేసినట్లవుతుందని సీఎం వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

APSDMA Alert: అలెర్ట్ ఏపీకి మరో అల్పపీడనం! ఆ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు!

అదే విధంగా కొన్ని కంపెనీలు పూర్తిగా కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టే యత్నం చేశాయి. కానీ అవి నాణ్యత తగ్గించి, కొత్త పేర్లతో ఎక్కువ లాభాలు పొందేందుకు మాత్రమేనని అధికారుల అభిప్రాయం. దీనిని దృష్టిలో ఉంచుకుని కొత్త బ్రాండ్ల అవసరం లేదని సీఎం ఖరారు చేశారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని మద్యం మార్కెట్‌లో స్పష్టమైన దిశనిచ్చేలా కనిపిస్తోంది.

SBI Youth Fellowship: ఎస్‌బీఐ యూత్ ఫెలోషిప్! నెలకు రూ.15 వేల స్టైపెండ్‌తో పాటు... అర్హతలు,లాస్ట్ డేట్!

ఇక మద్యం బ్రాండ్ల ధరల సవరణ అంశంపై కూడా ప్రభుత్వం చర్చలు జరిపింది. ప్రస్తుతం ఉన్న ధరల కంటే తగ్గిస్తే ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగే అవకాశముందని ఎక్సైజ్ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో టెండర్ కమిటీ అధ్యయనం చేసి తుది సిఫారసులు చేస్తుందని, ఆ తరువాతే కొత్త ఆదేశాలు వెలువడతాయని సమాచారం.

AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! వారందరికీ రూ.కోటి లబ్ధి! ఎలాగంటే?

మొత్తం మీద, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మద్యం బ్రాండ్ల ప్రవేశానికి అడ్డుకట్ట వేసి, ఇప్పటికే ఉన్న బ్రాండ్ల ధరలను సమీక్షించేందుకు అడుగులు వేసింది. దీంతో రాష్ట్రంలోని మద్యం వ్యాపారం మరింత నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంది.

35% Subsidy: ఏపీలో డ్వాక్రా మహిళలకు భారీ శుభవార్త! వాటిపై ఏకంగా 35% రాయితీ!
Free Driving Training: ఎస్సీ యువతకు బంపరాఫర్! ఏపీ ప్రభుత్వ ఉచిత డ్రైవింగ్ శిక్షణ... దరఖాస్తు వివరాలు!
Police: మహిళా పోలీస్‌లకు కొత్త భరోసా..! శిక్షణ, సౌకర్యాలు, అవకాశాలపై స్పెషల్ ప్లాన్‌!
Railway: దసరా – దీపావళి బంపర్‌ ఆఫర్‌..! ప్రత్యేక రైళ్లతో ప్రయాణికులకు రైల్వే సర్‌ప్రైజ్‌!
Farmers Loans: ఏపీలోని రైతులకు భారీ శుభవార్త! లోన్ల కోసం ఇకపై అవి అవసరం లేదు! మంత్రి కీలక ప్రకటన!