ఏపీలో మెగా డీఎస్సీ (AP Mega DSC) పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది. జూన్ 6 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి చెందిన వారితోపాటు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కలిపి మొత్తం 3,35,401 మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేశారు. దీంతో రాష్ట్రంతోపాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. దరఖాస్తు సమయంలోనే పరీక్ష కేంద్రాలకు సంబంధించి ఐచ్ఛికాలు స్వీకరించారు. ఎక్కువ మందికి వీటి ప్రకారమే పరీక్ష కేంద్రాలను కేటాయించారు. ఇక, జూన్ 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరగనున్న మెగా డీఎస్సీ పరీక్షల్లో.. ప్రతిరోజు రెండు సెషన్లలో డీఎస్సీ నిర్వహించనున్నారు.. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్ జరగనుండగా.. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది.. అయితే, ఈ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ద్వారా నిర్వహించబోతోంది ఏపీ విద్యాశాఖ..
ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వెస్ట్ బైపాస్‌లో కీలక మలుపు - రింగ్ రోడ్ నిర్మాణం కీలకం! కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఇక తగ్గేదేలే!
పథకాలపై టీడీపీ నేతలకు చంద్రబాబు క్లారిటీ! టెలీకాన్ఫరెన్స్ లో కీలక వ్యాఖ్యలు!
పులివెందులలో రాజకీయ దుమారం! 15 మందిపై కేసు నమోదు!
అమెరికాలో భారతీయులు మృతి.. అందుకు కారకులకు జైలు శిక్ష! భారీ మంచు తుఫాన్..
మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన! దెబ్బకు అంతా సైలెంట్!
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ధరలు పెంపు! క్వార్టర్‌కు రూ.6 నుండి రూ.30 వరకు..
14 ఏళ్ల తర్వాత తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రకటన.. ఉత్తమ నటుడిగా.. విజేతలు వీరే.!
ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు, మరో కొత్త పథకం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: