ఇది కూడా చదవండి: AP Nominated Posts: వారికి గుడ్‌న్యూస్.. నామినేటెడ్ పోస్టుల భర్తీపై మరోసారి ఫోకస్! ఐవీఆర్ఎస్ ద్వారా..
గ్లోబల్ వార్మింగ్ (Global warming) నేపథ్యంలో గ్రీన్ హైడ్రోజన్ (Green hydrogen) కు ప్రాధాన్యం పెరిగిందని, విద్యుత్ తయారీ సంస్థలు దీనిపై పరిశోధనలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. అమరావతి (Amaravati)లోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ (SRM University)లో ఏర్పాటు చేసిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్లో సీఎం పాల్గొని ఎనర్జీ కంపెనీల ఎండీ, సీఈవోలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. "మీ ఆలోచనలు వినడానికి, ఆవిష్కరణలు తెలుసుకోవడానికే ఇక్కడకు వచ్చాను. విద్యుత్ సంస్కరణలు మొదట ప్రారంభించింది నేనే.
ఇది కూడా చదవండి: Cybercrimes: సైబర్ నేరాలకు చెక్ పెట్టే దిశగా చర్యలు.. 24 గంటలు సేవలు అందుబాటులో.. పిటిషన్ల కమిటీ కీలక ప్రకటన!
సంస్కరణలు అమలు చేసిన కారణంగా అప్పట్లో అధికారం కోల్పోయాం. తక్కువ ఖర్చుతో హరిత విద్యుత్ తయారీ, స్టోరేజీపై దృష్టి సారించాలి. ఏపీ ఇలాంటి పరిశోధనలు, ఆవిష్కరణలకు కేంద్ర బిందువు కావాలి. కేంద్రం కూడా గ్రీన్ హైడ్రోజన్కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. 5 గిగావాట్ల (5 gigawatts) హరిత విద్యుత్ తయారు చేయాలని ప్రధాని మోదీ (Prime Minister Modi) లక్ష్యంగా నిర్దేశించారు. నీతి ఆయోగ్ కూడా దీనిపై దృష్టి సారించింది. భవిష్యత్లో ఆంధ్రప్రదేశ్ (AndhraPradesh) హైడ్రోజన్ వ్యాలీగా మారనుంది” అని సీఎం అన్నారు. ఈ సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యుడు సారస్వత్ కూడా పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Annadata Sukhibhava Last Date: ఏపీ రైతులకు అలర్ట్.. వారికి మాత్రమే రూ.7,000.. వెంటనే ఇలా చెయ్యండి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Annavaram Temple: అన్నవరం ఆలయంలో షాక్! దేవస్థాన నిబంధనలు ఉల్లంఘన – అర్చకుడు సస్పెండ్!
Delhi Schools: ఢిల్లీలో 20కి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు! వారంలోనే ఇది మూడోసారి!
Irrigation Projects AP: శుభవార్త.. 12 ఏళ్ల తర్వాత సీమకు వరదలా నీరు.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: