ఇది కూడా చదవండి: NRI లు పంపే డబ్బు ఈ సం// రికార్డు బ్రేక్! ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశం గా ఇండియా! ఆ దేశం నుండే ఎక్కువ!
ఏపీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ ను కలిశారు. ఏపీ (AndhraPradesh) లో రైతుల సమస్యలపై కేంద్రమంత్రితో చర్చించారు. మామిడి రైతులు (Mango farmers) ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. తొతాపురి మామిడి ధర తగ్గడంతో రైతులకు నష్టం వాటిల్లుతోందన్నారు. కిలో ధర రూ.8కి పడిపోవడంతో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ధరల లోటు చెల్లింపు పథకం కింద మద్దతు ధరగా రూ.12 నిర్ణయించినట్టు కేంద్ర మంత్రికి వివరించారు.
ఇది కూడా చదవండి: Krishna River Flood: కృష్ణానదికి పెరుగుతున్న వరదపోటు! శ్రీశైలానికి గంట గంటకూ.. భారీ జలప్రవాహం!
6.5లక్షల మెట్రిక్ టన్నుల తొతాపురి కొనుగోలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.260 కోట్లు ఖర్చు చేస్తుందని, కేంద్ర భాగస్వామ్యం కోరారు. చిత్తూరు (Chittoor), తిరుపతి (Tirupati), అన్నమయ్య (Annamayya) జిల్లాల్లో కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైందన్నారు. వెనుకబడిన జిల్లాల కోసం మైక్రో ఇరిగేషన్ పథకానికి రాయితీ పెంపుపై విజ్ఞప్తి చేశారు. బుందేలఖండ్ తరహాలో ఏపీకి కేంద్రం అదనపు సాయం చేయాలని అచ్చెన్నాయుడు కోరారు. అచ్చెన్నాయుడితో పాటు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) కూడా సమావేశంలో పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Dwakra: ఏపీలో డ్వాక్రా మహిళలకు అద్భుతమైన అవకాశం..! ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు, వివరాలివే..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Lokesh Tour: నెల్లూరు రొట్టెల పండుగలో పాల్గొన్న లోకేశ్.. ఏ రొట్టె తీసుకున్నారంటే.?
Jagan Shock : వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేతలకు నోటీసులు జారీ! పోలీస్ స్టేషన్‌కి..
Raghurama Speech: నాకు ఒక్క రోజు హోంమినిస్టర్ పదవి ఇస్తే రెడ్ బుక్ కాదు.. అంతా బ్లడ్ బుక్కే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: