ఇది కూడా చదవండి: NRI లు పంపే డబ్బు ఈ సం// రికార్డు బ్రేక్! ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశం గా ఇండియా! ఆ దేశం నుండే ఎక్కువ!

తిరుపతి (Tirupati) జిల్లాలోని కృష్ణపట్నం పారిశ్రామిక నగరం (Chris City)పై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రూ.37,500 కోట్ల పెట్టుబడితో 4,67,500 మందికి ఉపాధి కల్పించే ఈ ప్రాజెక్టును వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయగా, ఎన్డీయే సర్కార్ ఆటంకాలను తొలగిస్తోంది. భూసేకరణ కోసం.. ప్రభుత్వ భూముల్లో పంటలు సాగు చేసుకుంటున్న రైతులకు పరిహారం చెల్లిస్తోంది. తాజాగా సేకరించిన భూమిలో మౌలిక సదుపాయాలు కల్పించే పనిలో పడింది. చెన్నై, కృష్ణపట్నం నౌకాశ్రయాలు, రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం (International Airport), చెన్నై (Chennai) - కోల్కతా జాతీయ రహదారి, చెన్నై- కోల్కతా (Kolkata) రైల్వేలైన్కు సమీపంలోని క్రిస్ సిటీలో ఏడాదిన్నరలో పనులు పూర్తి చేసి పరిశ్రమల స్థాపనకు మార్గం సుగమం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తాంది.

ఇది కూడా చదవండి: Raigad High Alert: తీరంలో విదేశీ బోటు కలకలం.. మహారాష్ట్రలో హైఅలర్ట్‌! ఆ ప్రాంతంలో భారీగా..

తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు (Nellore) జిల్లాల పరిధిలో క్రిస్ సిటీ ఏర్పాటుకు 2017లో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (నిక్తేక్ట్), రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నాయి. చెన్నై- బెంగళూరు (Bangalore) పారిశ్రామిక కారిడార్లో భాగమైన ఈ ప్రాజెక్టుకు మూడు దశల్లో 10,834 ఎకరాలు అవసరం. తొలి విడతలో కోట, చిల్లకూరు (Chillakuru) మండలాల్లో 2,500.49 ఎకరాలు సేకరించాలి. ఇందులో 985.604 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. వీటిలో దాదాపు 600 మంది రైతులు సాగు చేసుకుంటున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ఐదేళ్లూ భూసేకరణను పక్కనపడేసింది. కూటమి అధికారంలోకి వచ్చాక అన్నదాతలతో చర్చలు జరిపారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములు తీసుకుంటే బతుకుదెరువు కోల్పోతామని వారు వాపోయారు. దీంతో వారికి ఎకరాకు రూ.5.99 లక్షల చొప్పున చెల్లించాలని నిర్ణయించారు. అది చాలదని అన్నదాతలు విన్నవించడంతో రూ.8 లక్షలకు పెంచారు.

ఇది కూడా చదవండి: APNRT: ప్రవాసుల ఆదాయం పెంచే లక్ష్యంగా ఏపీఎన్‌ఆర్‌టీఎస్ భారీ ప్రణాళికలు! యువతకు విదేశీ ఉద్యోగాలు! ప్రెసిడెంట్ రవి వేమూరు!

మొత్తం రూ.78.84 కోట్ల పరిహారం ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 371ఎకరాలకు రూ.40కోట్లు రైతులఖాతాల్లో జమ చేశారు. గతేడాది జనవరి 8న క్రిస్ సిటీకి ప్రధాని మోదీ (Prime Minister Modi) శంకుస్థాపన చేశారు. రూ.2,139.43 కోట్లతో మౌలిక వసతులు కల్పించే ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు నిబ్డిక్ట్ రూ.531.36 కోట్లు విడుదల చేసింది. ప్రధాన, అంతర్గత రోడ్లు, వంతెనలు, నీటి సరఫరా, మురుగునీటి శుద్ధి ప్లాంటు, విద్యుత్తు ఉప కేంద్రాలు, తదితర వసతులు కల్పించే పనులు చేస్తున్నారు. రెండు ప్రధాన వంతెనల్లో ఒకదాని నిర్మాణం శరవేగంగా సాగుతోంది. నీటి సరఫరా వ్యవస్థకు సంబంధించి 69.48 కి.మీ.లకు గాను 10.14 కి.మీ. మేర పూర్తయింది. రోడ్ల నిర్మాణంలో భాగంగా 9 కి.మీ. మేర కట్ట పనులు చేశారు. 2027 ఫిబ్రవరి 13 నాటికి వీటన్నింటినీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భూసేకరణ పూర్తయిన వెంటనే మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ఈ పనులు మరింత వేగవంతమయ్యేలా చర్యలు తీసుకుంటాం. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆహారశుద్ధి, టెక్స్టైల్స్, ఇంజినీరింగ్ (Engineering), ఆటో మొబైల్ (Auto Mobile), ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు వస్తాయి. రాష్ట్రానికే క్రిస్ సిటీ తలమానికంగా మారుతుంది.

ఇది కూడా చదవండి: Dwakra: ఏపీలో డ్వాక్రా మహిళలకు అద్భుతమైన అవకాశం..! ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు, వివరాలివే..!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Raghurama Speech: నాకు ఒక్క రోజు హోంమినిస్టర్ పదవి ఇస్తే రెడ్ బుక్ కాదు.. అంతా బ్లడ్ బుక్కే!

Road Construction: 9 జిల్లాల ప్రజలకు శుభవార్త.. 373 రోడ్లకు ఇక నో టోల్ గేట్లు.. ఆ రోజు నుంచే.!

Toll Fee: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త.. ఈ మార్గాల్లో టోల్ ఫీజు తగ్గింపు!

Vijayawada Railway: మీకు ఇది తెల్సా.! రైల్వే ఛార్జీలు బాగా పెరిగాయ్.. కానీ లోకల్ ట్రైన్స్‌లో..

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రైలు మార్గాల్లో కొత్త సరిహద్దులు! కొత్తగా 240 కిమీ రైల్వే ట్రాక్!

Ration Card: ఏపీలో కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి..! లిస్టులో మీ పేరుందా? ఇలా సింపుల్‌గా చెక్ చేస్కోండి!

Inherited lands: వారసత్వ భూములకు తక్కువ ఖర్చుతో సెక్షన్ సర్టిఫికెట్లు.. చంద్రబాబు శుభవార్త !

America 249: వైట్ హౌస్ పైగా దూసుకెళ్లిన స్టెల్త్ బాంబర్లు... ట్రంప్ దంపతుల సెల్యూట్!

Srisailam Reservoir: కృష్ణాకు వరద నీటి ప్రవాహం... శ్రీశైలం డ్యామ్ వద్ద పరిస్థితి ఇలా.. నీటి మట్టం గరిష్ఠ స్థాయి!

SBI New Rules: ఎస్‌బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 15 నుంచి క్రెడిట్ కార్డు కొత్త రూల్స్! ఎంపిక చేసిన కార్డులపై..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group