ఇది కూడా చదవండి: Dwakra: ఏపీలో డ్వాక్రా మహిళలకు అద్భుతమైన అవకాశం..! ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు, వివరాలివే..!
విదేశాల్లో స్థిరపడిన భారతీయులు (Indians abroad / NRIs) తమ కష్టార్జితాన్ని(hard-earned income) దేశానికి పంపడంలో సరికొత్త రికార్డు(new record) సృష్టించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి అందిన విదేశీ చెల్లింపులు (Remittances) ఏకంగా 135.46 బిలియన్ డాలర్లకు చేరాయి. గతేడాదితో పోలిస్తే ఇది 14 శాతం అధికమని ఆర్‌బీఐ(RBI – Reserve Bank of India) విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: National Highways: ఆ జాతీయ రహదారులకు మారనున్న రూపు రేఖలు! 988 కిలో మీటర్ల మేర విస్తరణ!
ప్రపంచంలోనే భారత్(India) నంబర్ వన్ విదేశాల నుంచి సొమ్మును స్వీకరించడంలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచ బ్యాంకు (World Bank) ఆర్థికవేత్తలు రూపొందించిన నివేదిక ప్రకారం, 2024 క్యాలెండర్ ఇయర్‌లో భారత్‌కు 129.4 బిలియన్ డాలర్ల చెల్లింపులు అందాయి. ఈ జాబితాలో 68 బిలియన్ డాలర్లతో మెక్సికో రెండో స్థానంలో, 48 బిలియన్ డాలర్లతో చైనా(China) మూడో స్థానంలో ఉన్నాయి. ఫిలిప్పీన్స్ (Philippines)(40 బిలియన్ డాలర్లు), పాకిస్థాన్(Pakistan) (33 బిలియన్ డాలర్లు) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 2023లో కేవలం 1.2 శాతంగా ఉన్న రెమిటెన్స్‌ల వృద్ధి రేటు 2024లో ఏకంగా 5.8 శాతానికి పెరగడం గమనార్హం.
ఇది కూడా చదవండి: Good News: ఏపీలో వారందరికీ గుడ్ న్యూస్.. జీతాలు పెంపు! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!
పెరుగుదలకు కారణాలివే..
ఈ భారీ పెరుగుదలకు అనేక అంశాలు దోహదం చేశాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత అమెరికా సహా ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) దేశాల్లో ఉద్యోగ మార్కెట్లు తిరిగి పుంజుకోవడం ప్రధాన కారణంగా నిలిచింది. ముఖ్యంగా అమెరికాలో విదేశీ ఉద్యోగుల నియామకాలు కరోనాకు ముందున్న స్థాయి కంటే 11 శాతం పెరిగాయి. దీనికి తోడు విదేశాలకు వలస వెళ్లే భారతీయుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 1990లో 66 లక్షలుగా ఉన్న ప్రవాస భారతీయుల సంఖ్య, 2024 నాటికి 1.85 కోట్లకు చేరింది. వీరిలో దాదాపు సగం మంది గల్ఫ్ దేశాల్లోనే పనిచేస్తున్నారు.
అత్యధికంగా మొదటి స్థానంలో ఎక్కువ గల్ఫ్ దేశాల నుండే వస్తున్నాయి. అందులో UAE, సౌదీ,కువైట్,Oman,Bahrain,Qatar. రెండవ స్థానంలో అమెరికా,మూడవ స్థానంలో సింగపూర్, ఆస్ట్రేలియా ,మలేషియా ,న్యూజిలాండ్ మరియు నాలుగవ స్థానంలో యూరోప్ దేశాల నుండి వస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Inner Ringroad: ఏపీలో కొత్తగా మరో ఇన్నర్ రింగ్ రోడ్డు.. అక్కడే! మారనున్న రూపురేఖలు..!
ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్ను(Backbone of the Economy)
ఈ విదేశీ చెల్లింపులను ఆర్‌బీఐ ప్రైవేట్ బదిలీలుగా వర్గీకరించింది. 2024-25 జనవరి-మార్చి త్రైమాసికంలోనే భారత్‌కు 33.9 బిలియన్ డాలర్లు అందాయి. ఈ రెమిటెన్స్‌లు, సాఫ్ట్‌వేర్ సేవలు (100 బిలియన్ డాలర్లకు పైగా), వ్యాపార సేవల (100 బిలియన్ డాలర్లకు పైగా) ద్వారా వస్తున్న ఆదాయంతో కలిసి దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా నిలుస్తున్నాయి. దేశ మొత్తం కరెంట్ అకౌంట్ రాబడుల్లో 40 శాతానికి పైగా ఈ మూడు రంగాల నుంచే వస్తుండటంతో కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ) అదుపులో ఉండటానికి ఇవి ఎంతగానో సహాయపడుతున్నాయి.
ఇది కూడా చదవండి: NH Green signal:ఏపీలో కొత్తగా మరో నేషనల్ హైవే! రూ.2,500 కోట్లతో ..ఈ రూట్‌లోనే 1 గంటలో తిరుపతి!
ఇదే సమయంలో అమెరికాలో పనిచేస్తున్న భారతీయ నిపుణులకు, ఎన్నారైలకు ఒక శుభవార్త అందింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్' సవరించిన ముసాయిదాలో రెమిటెన్స్‌లపై పన్ను రేటును తొలుత ప్రతిపాదించిన 5 శాతం నుంచి 1 శాతానికి తగ్గించారు. ఇది అమల్లోకి వస్తే అమెరికా నుంచి భారత్‌కు డబ్బు పంపే వారికి మరింత ఊరట లభించనుంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Record: చరిత్రలోనే తొలిసారి రికార్డు ధర.. ఏకంగా రూ.22 వేలు! వారికి పండుగే పండుగ!
Good News: ఏపీలో వారందరికీ గుడ్ న్యూస్.. జీతాలు పెంపు! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!
LPG subsidy money: మీ బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి.. LPG సబ్సిడీ డబ్బులు పడుతున్నాయ్!
Chandrababu Speech: నో డౌట్.. సూపర్ 6 అమలు చేసి తీరుతాం! పెరిగిన ఆదాయాన్ని పేదలకు..
AP EAPCET: ఇంజినీరింగ్ అడ్మిషన్లకు కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్..! క్లాసులకి డేట్ ఫిక్స్!
WhatsApp Governance: ఏపీలో ఇకపై వాట్సప్ నుండే పన్నుల చెల్లింపు! ఆ అక్రమాలకు చెక్!
Tirupati Trains: కర్ణాటక నుంచి తిరుపతికి వీక్లీ ఎక్స్ ప్రెస్! ఏపీలో హాల్ట్ స్టేషన్లు ఇవే!
E-Passport: చిప్‌తో కొత్త పాస్‌పోర్టులు! ఏమిటీ ఈ-పాస్‌పోర్ట్? ఎలా పనిచేస్తుంది?
Hyderabad To Vizag: హైదరాబాద్-విశాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్! 2 గంటలు తగ్గబోతున్న దూరం?
Gold Pricedrop: తొందరపడి బంగారం ఇప్పుడే కొనకండి.. ధరలు ఇంకా భారీగా తగ్గబోతున్నాయి! కారణం ఏంటంటే?
AP Rains: ఏపీలో వచ్చే 3 రోజుల వాతావరణం ఇలా.. ఈ ప్రాంతాలకు ఉరుములతో వర్షాలు!
Lokesh wishes: ప్రసాద్‌ను అభినందించిన లోకేశ్! విశాఖ జిల్లా మత్స్యకార గ్రామానికి..
Super Plan: ఏపీ ప్రభుత్వం సూపర్ ప్లాన్! ఆ 8 ప్రాంతాలకు మహర్దశ!
First Digital Highway: దేశంలో తొలి ఏఐ డిజిటల్ హైవే! ఎక్కడో తెలుసా?
AP Government: మరో పథకానికి డేట్ ఫిక్స్! ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: