ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ సేవల్లో అంతరాయం చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం నుంచి వేలాది మంది వినియోగదారులు ఫోన్ కాల్స్ చేయలేకపోతున్నారని, మొబైల్ డేటా యాక్సెస్ చేయలేకపోతున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వినియోగదారులు ఎక్కువగా సోషల్ మీడియా వేదిక X ద్వారా తమ సమస్యలను పంచుకున్నారు.
డౌన్‌డిటెక్టర్ వెబ్‌సైట్ ప్రకారం, మధ్యాహ్నం 3:30 గంటల నుంచి ఫిర్యాదులు పెరుగుతూనే వచ్చాయి. అందులో 71% మంది వినియోగదారులు కాల్స్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, 15% మంది ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. మరో 14% మంది తమ ఎయిర్‌టెల్ నంబర్లలో సిగ్నల్ అందడం లేదని పేర్కొన్నారు.
అయితే, ఈ డౌన్‌టైమ్ కారణంగా ఏఏ ప్రాంతాలు లేదా సర్కిళ్లు ప్రభావితమయ్యాయో స్పష్టమైన సమాచారం వెలువడలేదు. అంతేకాకుండా, ఈ సమస్యపై ఎయిర్‌టెల్ కంపెనీ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. దీనితో వినియోగదారులు మరింత ఆందోళన చెందుతున్నారు.
ఈ ఘటనతో సోషల్ మీడియాలో ఎయిర్‌టెల్ పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అనేక మంది తమ రోజువారీ పనులు అంతరాయానికి గురయ్యాయని చెప్పి అసహనం వ్యక్తం చేస్తున్నారు. టెలికాం రంగంలో పోటీ ఎక్కువగా ఉన్న ఈ సమయంలో ఎయిర్‌టెల్ వంటి ప్రధాన సర్వీస్ ప్రొవైడర్ నుంచి ఇలాంటి సమస్యలు రావడం వినియోగదారులను నిరాశపరిచింది.