గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని రాజకీయ వర్గాలు “ఏపీ నుంచి JSW స్టీల్ ఒడిశాకు తరలిపోతోంది” అని ప్రచారం చేస్తున్నారు. కొన్ని ట్వీట్లు, పోస్టులు ప్రభుత్వంపై విమర్శలతో నిండి ఉంటాయి. “ప్రస్తుత ఏపీ ప్రభుత్వం హ్యారేస్‌మెంట్, అవినీతి కారణంగా జిందాల్ కంపెనీ ఒడిశాకు వెళ్ళిపోయింది” అంటూ విమర్శలు కొనసాగుతున్నాయి. ఇదే విషయంపై ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టత ఇచ్చింది. నిజానికి JSW స్టీల్ ఏపీ నుంచి తరలిపోడం లేదు. ఒడిశాలో JSW స్టీల్ ఒక కంపెనీని కొనుగోలు చేసి, అక్కడ దక్షిణ కొరియాకు చెందిన POSCO తో జాయింట్ వెంచర్ ప్రారంభిస్తోంది.
మరిన్ని వివరాల్లో చెప్పాలంటే, ఆంధ్రప్రదేశ్‌లో JSW స్టీల్ సున్నపురాళ్లపల్లెలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రభుత్వం ముందే 1,100 ఎకరాల భూమిని కేటాయించింది. మొదటి దశలో ₹4,500 కోట్ల పెట్టుబడితో నిర్మాణం ప్రారంభం కానుంది, రెండో దశ ₹11,850 కోట్లతో పూర్తి చేయనున్నారు. మొదటి దశ 2026 ఏప్రిల్‌లో, రెండో దశ 2034 ఏప్రిల్‌లో ఉత్పత్తి ప్రారంభం కావాలని లక్ష్యంగా పెట్టారు. 2019లో JSW స్టీల్ ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో ₹1,075 కోట్లతో ఇనుప ఖనిజ ప్రాజెక్ట్ ప్రారంభించింది.
రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది, ఏపీ నుంచి JSW స్టీల్ తరలిపోతున్నట్లు ప్రచారం కచ్చితంగా అబద్ధం. ఈ ఫేక్ వార్తలు అమరావతి బ్రాండ్ ఇమేజ్, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తాయి. ఇలాంటి ప్రచారంపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.