బంగారం ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. గత కొన్ని రోజులుగా కాస్త స్థిరంగా ఉన్న గోల్డ్ రేట్లు, ఇప్పుడు వరుసగా రెండో రోజు భారీగా పెరిగాయి. ఇది గోల్డ్ లోకానికే కాదు, సామాన్య వినియోగదారులకు కూడా చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా వివాహాలు ఉన్న కుటుంబాలపై ఈ పెరుగుదల మరింత భారం మోపుతోంది.
హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ₹820 పెరిగి ₹1,02,220కు చేరింది. ఇది ఇప్పటి వరకు అందిన అత్యధిక ధరల్లో ఒకటిగా భావించవచ్చు. బంగారం కొనుగోలుదారులు ఈ ధరలు చూసి కొంత వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక 22 క్యారెట్ల పసిడి ధర కూడా ఒక్కరోజులో ₹750 పెరిగి 10 గ్రాములకు ₹93,700కి చేరుకుంది. ఆభరణాల తయారీకి ప్రధానంగా ఉపయోగించే ఈ క్వాలిటీ గోల్డ్ రేటు ఇలా పెరగడం వల్ల నగల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. నగల షాపుల్లో కొనుగోలు తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
మరోవైపు వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. కిలో వెండి ధర ప్రస్తుతం ₹1,23,000 వద్ద ఉంది. ఇటీవల కొన్ని రోజులు వెండి కూడా భారీ ఊగిసలాటలు ఎదుర్కొన్నప్పటికీ, ప్రస్తుతం స్థిరంగా ఉంది.
గత నాలుగు రోజుల్లో బంగారం ధరలు రూ.2,400కి పైగా పెరిగాయి. ఇది సాధారణ వినియోగదారులకు పెద్ద ఆర్ధిక భారం. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌ల్లో గోల్డ్ రేట్ల పెరుగుదల, డాలర్ బలపడటం, ఇన్ఫ్లేషన్ భయాలు వంటి అంశాలు దీని వెనుక ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో కొనుగోలు చేయాలా లేదా వేచి చూడాలా? అనే సందేహం చాలామందిలో ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పెరిగే ధోరణి కొనసాగితే మరింత ధరల పెరుగుతాయి. అందుకే అవసరమైన వారికి మాత్రమే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.