గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ (GMC) “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 14న (గురువారం) 10 కిలోమీటర్ల పొడవైన జాతీయ పతాకాన్ని ప్రదర్శించనుంది. ఈ కార్యక్రమం ద్వారా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ముందు రోజు దేశవ్యాప్తంగా ఒక కొత్త రికార్డు సృష్టించనున్నారు.
దేశంలోనే మొదటి సారి GMC కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు, 9 అడుగుల వెడల్పుతో 10 కిలోమీటర్ల పొడవు ఉన్న జాతీయ పతాకం ప్రదర్శన ఇది దేశంలోనే మొదటిసారి జరగనుంది. అన్ని మతాల, వర్గాల ప్రజలు, విద్యార్థులు, సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొని జాతీయ ఏకతను, దేశభక్తిని పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్యక్రమ వివరాలు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి సూచనల మేరకు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” మార్గదర్శకాల ప్రకారం ఈ ప్రదర్శన మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. రైల్వే గేట్ (ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్-1) నుండి మొదలై, అమరావతి రోడ్, లక్ష్మీపురం రోడ్, బ్రిందావన్ గార్డెన్స్, గుజ్జనగుండ్ల మార్గంగా మొత్తం 10 కిలోమీటర్ల వరకు సాగుతుంది.
కొత్త రికార్డు లక్ష్యం ఇంతకుముందు 9 కిలోమీటర్ల జాతీయ పతాకం ప్రదర్శన రికార్డు ఉండగా, గుంటూరు ఈసారి దాన్ని అధిగమించనుందని కమిషనర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ పతాకాన్ని కార్యక్రమం తర్వాత మడిచిపెట్టి వచ్చే ఏడాది ఉపయోగించేందుకు భద్రపరుస్తారు. ప్రతి సంవత్సరం ఒక కిలోమీటర్ పొడవు పెంచే యోచన కూడా ఉంది.
ప్రజల భాగస్వామ్యం ముఖ్యం
ట్రాఫిక్ ఏర్పాట్లను జిల్లా పోలీసులు పర్యవేక్షిస్తారు. జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు మరియు సాధారణ ప్రజలు అందరూ పాల్గొనాలని కోరారు. ఆగస్టు 13 నుండి 15 వరకు ప్రతి ఇంటి పైభాగంలో జాతీయ పతాకాన్ని ఎగరేయాలని ప్రజలకు సూచించారు.