Modi: ఆగస్టు 2 నుంచి ‘నషా ముక్త్ యువ ఫర్ విక్షిత్ భారత్’ జాతీయ ప్రచారానికి శ్రీకారం!

Modi: మాదకద్రవ్యాల బారిన పడకుండా యువతను చైతన్యపరచడం, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి యువశక్తిని భాగస్వామ్యం చేయడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘నషా ముక్త్ యువ ఫర్ విక్షిత్ భారత్’ పేరుతో దేశవ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 2 (ఆదివారం) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించనున్నారు.

Modi
Modi

మాదకద్రవ్యాల నిర్మూలనకు దేశవ్యాప్త ఉద్యమం.. మోదీ చేతుల మీదుగా ప్రారంభం..

‘నషా ముక్త్ యువ’ ఉద్యమంలో కోటి మందికి పైగా యువత భాగస్వామ్యం..

న్యూఢిల్లీ: మాదకద్రవ్యాల బారిన పడకుండా యువతను చైతన్యపరచడం, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి యువశక్తిని భాగస్వామ్యం చేయడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘నషా ముక్త్ యువ ఫర్ విక్షిత్ భారత్’ పేరుతో దేశవ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 2 (ఆదివారం) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించనున్నారు.

కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రారంభ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఒక కోటి మందికి పైగా యువత పాల్గొంటారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పాల్గొనే వారంతా ‘నషా ముక్త్ ప్రతిజ్ఞ’ (Nasha Mukt Pledge) చేసి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సంకల్పం వ్యక్తం చేయనున్నట్లు చెప్పారు.

‘నషా ముక్త్ యువ ఫర్ విక్షిత్ భారత్’ ప్రచారాన్ని 100 వారాల పాటు కొనసాగే జాతీయ జనభాగస్వామ్య ఉద్యమంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. యువతలో మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన పెంచడం, వ్యసనాలకు దూరంగా ఉండే జీవనశైలిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.

ప్రతి ఆదివారం యువత ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతి కార్యక్రమంలో పాల్గొనేవారు నషా ముక్త్ ప్రతిజ్ఞ చేయడం ద్వారా సమాజంలో మాదకద్రవ్యాల వ్యతిరేక సందేశాన్ని విస్తృతంగా తీసుకెళ్లేలా ప్రణాళిక రూపొందించారు.

ఈ జాతీయ ఉద్యమంలో మై భారత్ (My Bharat) వాలంటీర్లు, నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS) సభ్యులు, యువజన క్లబ్‌లు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు (NGOs), పరిశ్రమల సంఘాలు, ఆధ్యాత్మిక సంస్థలు భాగస్వామ్యం కానున్నాయి.

వివిధ వర్గాల యువతను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ‘వ్యసన రహిత యువత – వికసిత్ భారత్’ అనే లక్ష్యాన్ని సాకారం చేయడమే ఈ ప్రచారం ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే యువత మై భారత్ (My Bharat) వేదిక ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న వారు దేశవ్యాప్తంగా నిర్వహించే అవగాహన కార్యక్రమాల్లో భాగస్వాములై మాదకద్రవ్యాల నిర్మూలన కోసం జరుగుతున్న ఈ మహత్తర ఉద్యమంలో తమ వంతు పాత్ర పోషించే అవకాశం కల్పించబడుతుంది.

దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం, యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు ఈ ప్రచారాన్ని కీలక అడుగుగా భావిస్తోంది. యువతలో సామాజిక బాధ్యతను పెంపొందిస్తూ, ఆరోగ్యవంతమైన, వ్యసన రహిత భారత నిర్మాణానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Be the first to react

Latest