Modi: డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళులు!
Modi: భారత మాజీ నాయకుడు డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఘన నివాళులు అర్పించారు. ఆయనను ధైర్యం, జాతీయత, నిస్వార్థ సేవలకు శాశ్వత ఉదాహరణగా అభివర్ణించారు. ఆయన జీవితం దేశ సమగ్రతకు అంకితమైనదిగా నిలిచిందని ప్రధాని పేర్కొన్నారు.
దేశ సమగ్రత కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు – డా. ముఖర్జీపై మోదీ ప్రశంసలు..
ఆర్టికల్ 370 రద్దు.. డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీకి నిజమైన నివాళి – ప్రధాని మోదీ..
భారత మాజీ నాయకుడు డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఘన నివాళులు అర్పించారు. ఆయనను ధైర్యం, జాతీయత, నిస్వార్థ సేవలకు శాశ్వత ఉదాహరణగా అభివర్ణించారు. ఆయన జీవితం దేశ సమగ్రతకు అంకితమైనదిగా నిలిచిందని ప్రధాని పేర్కొన్నారు.
ప్రధాని మోదీ ఒక వ్యాసంలో మాట్లాడుతూ, దేశ విభజన సమయంలో పశ్చిమ బెంగాల్ భారత్లోనే ఉండేలా ఆయన చేసిన కృషి కీలకమని తెలిపారు. అనంతరం జమ్మూ కశ్మీర్ అంశంపై ఆయన జీవితాన్ని అంకితం చేశారని చెప్పారు. 2019లో ఆర్టికల్ 370, 35(A) రద్దు నిర్ణయం ఆయన త్యాగానికి నిజమైన నివాళిగా నిలిచిందని ప్రధాని వ్యాఖ్యానించారు.
డా. ముఖర్జీ విద్యారంగంలో కూడా విశేష సేవలు అందించారని ప్రధాని గుర్తు చేశారు. ఆయన కలకత్తా విశ్వవిద్యాలయానికి అత్యంత యువ వైస్-చాన్సలర్గా పనిచేసి, విద్య, పరిశోధన, విద్యార్థుల సంక్షేమానికి అనేక సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు.
స్వతంత్ర భారతదేశ తొలి పరిశ్రమల మరియు సరఫరా మంత్రిగా కూడా ఆయన సేవలు చేశారని ప్రధాని పేర్కొన్నారు. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, సింద్రీ ఎరువుల కర్మాగారం వంటి ప్రాజెక్టుల ద్వారా ఆధునిక భారత పరిశ్రమలకు పునాది వేశారని చెప్పారు. అలాగే హస్తకళలు, కుటీర పరిశ్రమలు, చేతివృత్తుల వారికి ఆయన ప్రోత్సాహం అందించారని గుర్తు చేశారు.
1943 బెంగాల్ కరువు సమయంలో బాధితుల కోసం సహాయ కేంద్రాలు, కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసి అనేక మందికి అండగా నిలిచారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆయన సేవా భావం, దేశభక్తి తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.
Be the first to react