LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
National

Rayachoti: రాయచోటిలో జలధార కార్యక్రమం… కంచాలమ్మ గండి చెరువు పునరుద్ధరణకు చర్యలు

Rayachoti: రాయచోటిలో జలవనరుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. “జలధార జల హారతి” కార్యక్రమం భాగంగా రాయచోటి మండలం ఎగువ అబ్బవరం వద్ద ఉన్న కంచాలమ్మ గండి చెరువును రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్…

AndhraPravasi News Desk 1 min read
Rayachoti: రాయచోటిలో జలధార కార్యక్రమం… కంచాలమ్మ గండి చెరువు పునరుద్ధరణకు చర్యలు

జలధార జల హారతితో కంచాలమ్మ గండి చెరువు పునర్జీవనం కల్పించాలి..

మాండవ్య నది అభివృద్ధికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిశానిర్దేశం

రాయచోటిలో జలవనరుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. “జలధార జల హారతి” కార్యక్రమం భాగంగా రాయచోటి మండలం ఎగువ అబ్బవరం వద్ద ఉన్న కంచాలమ్మ గండి చెరువును రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం సందర్శించారు.

ఈ సందర్భంగా ఇరిగేషన్, డ్వామా అధికారులతో కలిసి మంత్రి, కలెక్టర్ మాండవ్య నది నుంచి చెరువుకు వచ్చే నీటి ప్రవాహ మార్గాన్ని పరిశీలించారు. ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో సమగ్రంగా చర్చించారు.

మంత్రి మాట్లాడుతూ మాండవ్య నదిని పూర్తిగా శుభ్రపరచి, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైన ప్రదేశాల్లో కొత్త చెక్‌డ్యామ్‌లు నిర్మించడం, దెబ్బతిన్న చెక్‌డ్యామ్‌లను మరమ్మతు చేయడం ద్వారా నీటి నిల్వ పెరగడంతో పాటు భూగర్భ జలాల స్థాయి కూడా పెరుగుతుందని తెలిపారు.

కంచాలమ్మ గండి చెరువుకు నీరు వచ్చే సప్లై ఛానల్‌ను సరిచేసి, ఎక్కడైనా అడ్డంకులు ఉంటే తొలగించి, నీటి ప్రవాహం నిరంతరంగా ఉండేలా చూడాలని మంత్రి కలెక్టర్‌ను ఆదేశించారు. చెరువు పునరుద్ధరణతో పరిసర ప్రాంతాల్లో వ్యవసాయానికి మేలు జరిగి, తాగునీటి సమస్యలు కూడా తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

అదేవిధంగా మాండవ్య నదిని అందంగా తీర్చిదిద్దేలా బ్యూటిఫికేషన్ పనులు కూడా చేపట్టాలని మంత్రి సూచించారు. అలాగే గాలివీడు రింగ్ రోడ్ సమీపంలో ఉన్న ట్యాంకును కూడా పరిశీలించి, అక్కడి నీటి ప్రవాహ పరిస్థితులపై అధికారులతో చర్చించారు.

మంత్రిగారి సూచనల మేరకు చేపట్టాల్సిన పనులపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసి తక్షణమే ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జలధార కార్యక్రమాన్ని ఫలితాల ఆధారంగా విజయవంతం చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్, డ్వామా మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Be the first to react

More Coverage

Ram Mohan Naidu: ఏర్ ఇండియా AI-171 ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు!

Ram Mohan Naidu: ఏర్ ఇండియా AI-171 ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు!

Ram Mohan Naidu: ఏర్ ఇండియా విమానం AI-171 ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని కేంద్ర పౌర విమానయాన శ…

Strait of Hormuz: ఇటీవల దాడుల్లో ముగ్గురు భారతీయుల మృతి.. తాజా దాడి పుకార్లతో ఒమన్ తీరంలో ఒక్కసారిగా ఉత్కంఠ!

Strait of Hormuz: ఇటీవల దాడుల్లో ముగ్గురు భారతీయుల మృతి.. తాజా దాడి పుకార్లతో ఒమన్ తీరంలో ఒక్కసారిగా ఉత్కంఠ!

Strait of Hormuz: ఒమన్‌ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న మరో వాణిజ్య నౌకపై దాడి జరిగిందన్న వా…

Supreme Court: మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట! రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై పిటిషన్ కొట్టివేత!

Supreme Court: మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట! రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై పిటిషన్ కొట్టివేత!

Supreme Court: మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినే…