LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Lifestyle

World Happiness Report 2026: వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2026... వరుసగా 9వ సారి ఫిన్లాండ్ టాప్.. భారత్ స్థానం ఎంత అంటే..!

World Happiness Report 2026: 2026 ప్రపంచ సంతోష నివేదిక విడుదలయ్యింది. ఫిన్లాండ్ వరుసగా 9వ ఏడాది అగ్రస్థానంలో నిలవగా, సోషల్ మీడియా వాడకం వల్ల యువతలో సంతోషం తగ్గుతున్నట్లు నివేదిక వెల్లడించింది.

AndhraPravasi News Desk 2 min read
World Happiness Report 2026: వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2026... వరుసగా 9వ సారి ఫిన్లాండ్ టాప్..  భారత్ స్థానం ఎంత అంటే..!

World Happiness Report 2026: ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ తన రికార్డును పదిలం చేసుకుంది. తాజాగా విడుదలైన 'ప్రపంచ సంతోష నివేదిక 2026'లో వరుసగా తొమ్మిదో ఏడాది కూడా ఫిన్లాండ్ మొదటి స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఐస్‌లాండ్, డెన్మార్క్, స్వీడన్, నార్వే వంటి నార్డిక్ దేశాలు ఎప్పటిలాగే టాప్ 10లో తమ స్థానాలను సుస్థిరం చేసుకున్నాయి. అయితే, ఈసారి రిపోర్ట్‌లో ఒక ఆసక్తికరమైన మార్పు చోటుచేసుకుంది. లాటిన్ అమెరికాకు చెందిన కోస్టారికా అనూహ్యంగా పుంజుకుని ఏకంగా నాలుగో స్థానానికి చేరుకుంది. కుటుంబ అనుబంధాలు, సామాజిక భద్రత కారణంగానే ఆ దేశ ప్రజలు ఇంత సంతోషంగా ఉన్నారని నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు, అగ్రరాజ్యం అమెరికా సహా కెనడా, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో సంతోషం క్రమంగా ఆవిరవుతోంది. ముఖ్యంగా ఇంగ్లీష్ మాట్లాడే దేశాల్లో 25 ఏళ్ల లోపు యువతలో మానసిక ప్రశాంతత భారీగా తగ్గిపోయింది. ఈ నివేదిక ప్రకారం అమెరికా 23వ స్థానానికి, బ్రిటన్ 29వ స్థానానికి పడిపోయాయి.ఈ తాజా నివేదిక ప్రకారం భారతదేశం 118వ స్థానంలో నిలిచింది. పొరుగు దేశం పాకిస్థాన్ 109వ ర్యాంకు ఉంది. సంపద ఉన్నప్పటికీ, సామాజిక ఒంటరితనం పెరగడం వల్ల ఈ దేశాల్లో సంతోషం తగ్గుముఖం పట్టినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ జాబితాలో యుద్ధ ప్రాబల్య ప్రాంతమైన ఆఫ్ఘనిస్థాన్ చిట్టచివరి స్థానంలో నిలిచి, ప్రపంచంలోనే అత్యంత విచారకరమైన దేశంగా మిగిలిపోయింది.

ఈ ఏడాది రిపోర్ట్‌లో ఒక ప్రధాన అంశం అందరినీ ఆలోచింపజేస్తోంది. అదే 'సోషల్ మీడియా' ప్రభావం. యువత గంటల తరబడి సోషల్ మీడియాలో గడపడం వల్ల వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా వెస్ట్రన్ దేశాల్లోని టీనేజ్ అమ్మాయిల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. రోజుకు ఐదు గంటల కంటే ఎక్కువ సమయం ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి ప్లాట్‌ఫామ్స్‌పై గడిపేవారు తీవ్రమైన అసంతృప్తికి లోనవుతున్నారని నివేదిక స్పష్టం చేసింది. అల్గారిథమ్ ఫీడ్‌లు, ఇన్‌ఫ్లుయెన్సర్ల లైఫ్ స్టైల్‌తో తమను తాము పోల్చుకోవడం వల్ల యువతలో ఆత్మవిశ్వాసం తగ్గుతోందని ఆక్స్‌ఫర్డ్ ప్రొఫెసర్ జాన్-ఇమ్మాన్యుయేల్ డి నెవ్ అభిప్రాయపడ్డారు.

నిజానికి సోషల్ మీడియా అనేది ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడాలి, కానీ అది ఇప్పుడు కేవలం ఒక ప్రదర్శనశాలగా మారిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకు గంట కంటే తక్కువ సమయం సోషల్ మీడియా వాడే వారిలో సంతోషం ఎక్కువగా ఉందని, అసలు వాడని వారి కంటే కూడా వీరే బెటర్ గా ఉన్నారని రిపోర్ట్ చెబుతోంది. అంటే టెక్నాలజీని వాడుకోవాలి కానీ, దానికి బానిస కాకూడదని ఈ లెక్కలు సూచిస్తున్నాయి. అందుకే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు మైనర్ల కోసం సోషల్ మీడియాపై ఆంక్షలు విధించే దిశగా అడుగులు వేస్తున్నాయి.

ఫిన్లాండ్ వంటి దేశాలు ఎందుకు ఎప్పుడూ టాప్‌లో ఉంటున్నాయని పరిశీలిస్తే.. అక్కడ కేవలం డబ్బు మాత్రమే కాదు, సమానత్వం, మెరుగైన వైద్యం, సామాజిక భద్రత వంటి అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. మనుషుల మధ్య నమ్మకం, ఒకరికొకరు తోడుగా ఉండటం అనేవి సంతోషానికి అసలైన సూత్రాలని ఈ నివేదిక మరోసారి గుర్తుచేసింది. మన దేశంలో కూడా ఇలాంటి సామాజిక మార్పులు వస్తే తప్ప, సంతోషం అనే సూచీలో మనం ముందుకు వెళ్లడం సాధ్యం కాదు.

Be the first to react

More Coverage

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా హైవేలపై ప్రయాణించినప్పుడు రోడ్డు పక్కన లేదా పైన ఉండే బోర్డులను గమ…

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: దక్షిణ కొరియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారతీయులను హెచ్చరిస్తూ ఓ యువతి పోస్ట్ చేసిన వీడ…