LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Lifestyle

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి గంటల కొద్దీ నిరీక్షణ!

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతూ కొనసాగుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో దర్శనానికి ఎక్కువ సమయం పడుతోంది.

AndhraPravasi News Desk 1 min read
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి గంటల కొద్దీ నిరీక్షణ!

సర్వదర్శనం భక్తులకు 12 గంటల సమయం..

ఉచిత దర్శనం కోసం 30 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న భక్తులు..

తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతూ కొనసాగుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో దర్శనానికి ఎక్కువ సమయం పడుతోంది.

ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం సుమారు 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకోవాలంటే దాదాపు 12 గంటల సమయం పడుతోంది. అలాగే రూ.300 శీఘ్రదర్శనం టికెట్ తీసుకున్న భక్తులకు కూడా 3 నుంచి 4 గంటల వరకు నిరీక్షణ తప్పడం లేదు. టోకెన్ తీసుకున్న సర్వదర్శనం భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం పడుతోంది.

ఇక నిన్న ఒక్క రోజులోనే 79,878 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అదే సమయంలో 33,037 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల నుంచి స్వామివారి హుండీకి భారీగా కానుకలు అందాయి. నిన్న హుండీ ఆదాయం రూ.3.94 కోట్లుగా నమోదైంది.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు, తాగునీరు, ప్రసాదాల పంపిణీ వంటి సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు. భక్తులు సహనంతో ఉండాలని, అధికారులకు సహకరించాలని టిటిడి అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
 

Be the first to react

More Coverage

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా హైవేలపై ప్రయాణించినప్పుడు రోడ్డు పక్కన లేదా పైన ఉండే బోర్డులను గమ…

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: దక్షిణ కొరియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారతీయులను హెచ్చరిస్తూ ఓ యువతి పోస్ట్ చేసిన వీడ…