LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Lifestyle

OCI: OCI కార్డ్ విధానంలో మార్పులు.. డిజిటల్ దిశగా కేంద్రం కీలక నిర్ణయం!

OCI: విదేశాల్లో నివసించే భారతీయులకు (OCI కార్డ్ హోల్డర్లకు) సంబంధించిన పౌరసత్వ విధానంలో కేంద్ర ప్రభుత్వం పలు కీలక మార్పులు చేసింది.

AndhraPravasi News Desk 2 min read
OCI: OCI కార్డ్ విధానంలో మార్పులు.. డిజిటల్ దిశగా కేంద్రం కీలక నిర్ణయం!

OCI ప్రక్రియలు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే..

మైనర్లపై స్పష్టమైన నిబంధనలు..

బయోమెట్రిక్ డేటాతో వేగవంతమైన ఇమ్మిగ్రేషన్..

న్యూ ఢిల్లీ: విదేశాల్లో నివసించే భారతీయులకు (OCI కార్డ్ హోల్డర్లకు) సంబంధించిన పౌరసత్వ విధానంలో కేంద్ర ప్రభుత్వం పలు కీలక మార్పులు చేసింది. ఈ సవరణల ద్వారా వ్యవస్థను మరింత సులభతరం చేసి, పూర్తిగా డిజిటల్ విధానానికి మార్చే దిశగా అడుగులు వేసింది.

ఇప్పటివరకు ఆన్‌లైన్‌తో పాటు కాగితాల ప్రక్రియ కూడా ఉండేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం ఇకపై OCI నమోదు, రద్దు చేయడం (cancellation) వంటి అన్ని ప్రక్రియలు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే జరగనున్నాయి. దీంతో దరఖాస్తుదారులకు సమయం, శ్రమ తగ్గే అవకాశముంది.

హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, “OCI కార్డు కోసం దరఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా చేయాలి” అని స్పష్టం చేసింది. అలాగే భవిష్యత్తులో ఫిజికల్ కార్డ్‌తో పాటు ఎలక్ట్రానిక్ OCI (e-OCI) కూడా జారీ చేసే అవకాశాన్ని కల్పించింది. అన్ని రికార్డులు ఎలక్ట్రానిక్ రూపంలోనే భద్రపరుస్తారు.

ఇప్పటివరకు ప్రాక్టీస్‌లో ఉన్న కానీ స్పష్టంగా రూల్స్‌లో లేని కొన్ని అంశాలను ఇప్పుడు అధికారికంగా చేర్చారు. ముఖ్యంగా మైనర్ల విషయంలో, ఒక చిన్నారి ఒకేసారి భారత పాస్‌పోర్ట్‌తో పాటు మరో దేశ పాస్‌పోర్ట్‌ను కలిగి ఉండకూడదని నిబంధనను స్పష్టంగా పేర్కొన్నారు.

OCI హోదాను వదులుకోవాలనుకునే వారు కూడా ఇకపై ఆన్‌లైన్ ద్వారానే ప్రకటన ఇవ్వాలి. ఫిజికల్ కార్డ్ ఉన్నవారు సంబంధిత అధికారులకు దాన్ని సమర్పించాలి. దరఖాస్తు పూర్తయిన తర్వాత ఎలక్ట్రానిక్ అంగీకారం (acknowledgement) జారీ చేస్తారు. తరువాత వారి పేరు అధికారిక రికార్డుల నుంచి తొలగిస్తారు. రద్దు చేసిన కార్డులు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది.

ముందుగా ఉన్నప్పటికీ స్పష్టతలేని రివ్యూ ప్రక్రియను ఇప్పుడు మరింత క్రమబద్ధంగా మార్చారు. ఒక నిర్ణయంపై అభ్యంతరం ఉంటే, దాన్ని ఒక స్థాయి పై ఉన్న అధికారి పరిశీలిస్తారు. అలాగే, సంబంధిత వ్యక్తికి తన వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని నిబంధనల్లో పేర్కొన్నారు.

కొత్తగా ప్రవేశపెట్టిన మరో ముఖ్య అంశం బయోమెట్రిక్ డేటా వినియోగం. OCI దరఖాస్తుదారులు తమ బయోమెట్రిక్ వివరాలను “ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ ప్రోగ్రామ్” కోసం ఉపయోగించేందుకు ముందుగానే అంగీకారం ఇవ్వాలి. దీని వల్ల భవిష్యత్తులో విమానాశ్రయాల్లో వేగవంతమైన ప్రవేశం సాధ్యమవుతుంది.

ఇంతకు ముందు ఉండే డూప్లికేట్ దరఖాస్తులు వంటి అనవసరమైన ప్రక్రియలను పూర్తిగా తొలగించారు. మొత్తం వ్యవస్థను సులభంగా, పారదర్శకంగా మార్చే దిశగా ఈ మార్పులు తీసుకొచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ సవరణలతో OCI కార్డ్ హోల్డర్లకు సేవలు మరింత సులభం కావడంతో పాటు, ప్రభుత్వానికి కూడా పర్యవేక్షణ మరింత సమర్థవంతంగా ఉండనుంది.

Be the first to react

More Coverage

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా హైవేలపై ప్రయాణించినప్పుడు రోడ్డు పక్కన లేదా పైన ఉండే బోర్డులను గమ…

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: దక్షిణ కొరియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారతీయులను హెచ్చరిస్తూ ఓ యువతి పోస్ట్ చేసిన వీడ…