LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Latest News

Central Govt: ఎన్ని అవాంతరాలు ఎదురైనా గ్యాస్ సరాఫరాకు ఆటంకం కలగదు - కేంద్ర ప్రభుత్వం!

Central Govt: పశ్చిమ ఆసియా పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో దేశంలో గ్యాస్ సరఫరాపై ఎలాంటి అంతరాయం ఉండదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా గృహ వినియోగ LPG సరఫరా నిరంతరంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

AndhraPravasi News Desk 1 min read
Central Govt: ఎన్ని అవాంతరాలు ఎదురైనా గ్యాస్ సరాఫరాకు ఆటంకం కలగదు - కేంద్ర ప్రభుత్వం!

ఏప్రిల్ నెలలో 1 లక్ష 84 వేల టన్నులకుపైగా కమర్షియల్ LPG విక్రయాలు..

నిన్న ఒక్కరోజే 8,838 టన్నుల LPG అమ్మకాలు..

పశ్చిమ ఆసియా పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో దేశంలో గ్యాస్ సరఫరాపై ఎలాంటి అంతరాయం ఉండదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా గృహ వినియోగ LPG సరఫరా నిరంతరంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

న్యూఢిల్లీలో జరిగిన అంతర-మంత్రిత్వ సమావేశంలో సుజాత శర్మ, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ కార్యదర్శి మాట్లాడుతూ, దేశంలోని LPG డిస్ట్రిబ్యూటర్ కేంద్రాల్లో ఎక్కడా సరఫరా నిలిచిపోలేదని వెల్లడించారు. ఆన్‌లైన్ LPG బుకింగ్స్, డెలివరీ ఆథెంటికేషన్ కోడ్ ఆధారంగా సరఫరా ఇప్పటివరకు ఎన్నడూ లేనంత స్థాయిలో కొనసాగుతోందని చెప్పారు.

కమర్షియల్ LPG సరఫరా విషయానికి వస్తే, దేశవ్యాప్తంగా ఇది సుమారు 70 శాతం వరకు పునరుద్ధరించబడింది. ఏప్రిల్ నెలలో 1 లక్ష 84 వేల టన్నులకుపైగా కమర్షియల్ LPG విక్రయాలు జరిగాయి. నిన్న ఒక్కరోజే 8,838 టన్నుల LPG అమ్మకాలు నమోదయ్యాయి. అలాగే 5 కిలోల చిన్న సిలిండర్ల సరఫరా కూడా గణనీయంగా పెరిగి, నిన్న ఒక్కరోజే సుమారు 73 వేల సిలిండర్లు విక్రయించబడ్డాయి.

ఇక పోర్టుల కార్యకలాపాలపై కూడా ఎలాంటి ప్రభావం లేదని ముకేష్ మంగల్, మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ అదనపు కార్యదర్శి తెలిపారు. దేశంలోని అన్ని పోర్టులు సాధారణంగా పనిచేస్తున్నాయని, ఎక్కడా రద్దీ సమస్యలు లేవని చెప్పారు. పశ్చిమ ఆసియా ప్రాంతంలో ఉన్న భారతీయ సముద్ర కార్మికులు సురక్షితంగా ఉన్నారని, గత 24 గంటల్లో భారత జెండా నౌకలకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదని వివరించారు.

అలాగే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ సహకారంతో ఇప్పటివరకు 2,829 మంది భారతీయులను సురక్షితంగా దేశానికి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇటీవల కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, హర్మూజ్ జలసంధి  పరిస్థితి పై చర్చించారు. దిగుమతి-ఎగుమతి కార్యకలాపాలు నిరంతరంగా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
 

Be the first to react

More Coverage

Padma Awards: నేడు పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. 65 మంది ప్రముఖులకు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు!

Padma Awards: నేడు పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. 65 మంది ప్రముఖులకు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు!

Padma Awards: దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు ప…