అంజీర్ (figs) పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తాజా పండ్ల రూపంలోనూ, డ్రై ఫ్రూట్స్ రూపంలోనూ అందుబాటులో ఉంటాయి. తాజా పండ్లు కేవలం సీజన్‌లో లభిస్తే, డ్రై ఫ్రూట్స్ మాత్రం ఎప్పుడైనా తీసుకోవచ్చు. ముఖ్యంగా రాత్రి మూడు అంజీర్ పండ్లను నీటిలో నానబెట్టి, ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా తినడం ద్వారా శరీరానికి ఎనలేని ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇవి జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి, శరీరంలో మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తాయి. ఫైబర్‌తో కూడిన ఈ పండ్లు మంచి బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడతాయి, తద్వారా శరీరం ఆహారంలోని పోషకాల్ని సరిగా శోషించుకుంటుంది.
అంజీర్ పండ్లలో సహజ చక్కెరలు (గ్లూకోజ్, ఫ్రుక్టోజ్), మెగ్నిషియం, పొటాషియం వంటి ఖనిజాలూ, అలాగే క్యాల్షియం, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి తగిన శక్తిని అందిస్తాయి, ఎముకల సాంద్రతను పెంచుతాయి. ముఖ్యంగా మెనోపాజ్ దాటిన మహిళల కోసం ఇవి చాలా మంచివి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
అదేవిధంగా బీపీ నియంత్రణలో ఉంచుతాయి. బరువు తగ్గాలనుకునేవారికి, షుగర్ ఉన్నవారికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని వాపులను తగ్గించి, క్యాన్సర్, గుండె పోటు వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.