ప్రస్తుత కాలంలో చీజ్ ప్రాముఖ్యత రోజురోజుకి పెరుగుతూనే ఉంటుంది. సహజసిద్ధమైన చీజ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎముకల బలానికి అవసరమైన కాల్షియం, కండరాల నిర్మాణానికి తోడ్పడే ప్రోటీన్, మరియు మెదడు పనితీరును మెరుగుపరిచే విటమిన్ B12 పుష్కలంగా ఉంటాయి.
ముఖ్యంగా ఫ్రాన్స్‌లో పాలను సహజ పద్ధతిలో పులియబెట్టి (Fermentation) చీజ్ తయారు చేయడం వల్ల, ఇందులో మన జీర్ణవ్యవస్థను కాపాడే మంచి బ్యాక్టీరియా (Probiotics) అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఫ్రాన్స్ దేశంలో అత్యంత ఖరీదైన మరియు ప్రత్యేకత కలిగిన 10 చీజ్‌లను ఒక్కోటి గా తెలుసుకున్న అదే విధంగా తయారీ విధానం, ప్రత్యేకత, వాడకం మరియు ధరతో క్లియర్‌గా చూద్దాం.
కామెంబెర్ట్ డి నార్మాండీ: (Camembert de Normandie) అనేది నార్మాండీ ప్రాంతానికి చెందిన సంప్రదాయ చీజ్. పచ్చి ఆవు పాలను ఉపయోగించి, సహజ బ్యాక్టీరియాతో నెమ్మదిగా గడ్డకట్టించి చేతితో అచ్చుల్లో వేస్తారు. దీన్ని కొన్ని వారాలు పాటు చల్లని గదుల్లో పక్వం అయ్యేలా ఉంచుతారు. లోపల మెత్తగా, బయట తెల్లటి పొరతో ఉండే ఈ చీజ్‌ను బ్రెడ్‌తో, వైన్‌తో ఎక్కువగా వాడతారు. దీని ధర కిలోకు సుమారు ₹3,000 నుంచి ₹6,000 వరకు ఉంటుంది.
రోక్ఫోర్ట్ : (Roquefort) ఫ్రాన్స్‌లోని అత్యంత రాజసమైన బ్లూ చీజ్‌గా పరిగణిస్తారు. ఇది కేవలం గొర్రె పాలతో మాత్రమే తయారవుతుంది. ‘కోం బాలౌ’ గుహల్లో సహజంగా పక్వం చేయబడుతుంది. ఇందులో నీలం రంగు బూజు గీతలు ప్రత్యేక రుచి ఇస్తాయి. ఈ చీజ్‌ను సలాడ్లు, సాస్‌లు, వైన్‌తో కలిపి ఎక్కువగా వాడతారు. దీని ధర కిలోకు సుమారు ₹4,000 నుంచి ₹7,000 వరకు ఉంటుంది.
బ్రీ డి మెయున్: (Brie de Meaux) ప్యారిస్ పరిసర ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన సాఫ్ట్ చీజ్. పచ్చి ఆవు పాలను ఉపయోగించి దీర్ఘకాలం నెమ్మదిగా పక్వం చేస్తారు. వెన్నలా మెత్తగా కరిగిపోయే రుచి దీని ప్రత్యేకత. దీనిని చీజ్ ప్లాటర్స్‌లో, డెజర్ట్స్‌తో పాటు విస్తృతంగా వాడతారు. దీని ధర కిలోకు సుమారు ₹3,500 నుంచి ₹5,500 వరకు ఉంటుంది.
కాంటే – ఏజ్డ్: (Comté Aged) ఫ్రాన్స్ పర్వత ప్రాంతాల్లో తయారయ్యే హార్డ్ చీజ్. దీన్ని తయారు చేయడానికి చాలా ఎక్కువ పాలు అవసరం అవుతాయి మరియు 24 నుంచి 36 నెలల వరకు పక్వం చేస్తారు. ఎంత ఎక్కువ కాలం ఏజ్ అవుతుందో అంత ధర పెరుగుతుంది. ఈ చీజ్‌ను పాస్తా, ఫాండ్యూ, సూప్‌లలో ఎక్కువగా వాడతారు. దీని ధర కిలోకు సుమారు ₹6,000 నుంచి ₹8,000 వరకు ఉంటుంది.
ఎపోయిసెస్ డి బర్గోన్యే: (Époisses de Bourgogne) ఘాటైన వాసనకు ప్రసిద్ధి చెందిన చీజ్. దీన్ని తయారు చేసే సమయంలో ప్రత్యేకమైన లోకల్ బ్రాందీతో కడుగుతూ పక్వం చేస్తారు. రుచి మాత్రం చాలా లోతుగా, మృదువుగా ఉంటుంది. దీనిని బ్రెడ్‌తో లేదా స్పెషల్ డిన్నర్‌లలో వాడతారు. దీని ధర కిలోకు సుమారు ₹5,000 నుంచి ₹8,000 వరకు ఉంటుంది.
బ్యూఫోర్ట్: (Beaufort) ఫ్రెంచ్ ఆల్ప్స్ పర్వత ప్రాంతాల్లో తయారయ్యే చీజ్. ఎత్తైన ప్రాంతాల్లో మేసే ఆవుల పాలతో దీన్ని తయారు చేస్తారు. ఇది గట్టిగా ఉండి, తీపి రుచి కలిగి ఉంటుంది. ఫాండ్యూ, గ్రాటిన్ వంటకాల్లో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని ధర కిలోకు సుమారు ₹4,500 నుంచి ₹7,000 వరకు ఉంటుంది.
చెవ్రే: (Chèvre) అనేది మేక పాలను ఉపయోగించి తయారయ్యే చీజ్‌ల సమూహం. చిన్న ఉండలుగా లేదా రోల్స్ రూపంలో ఉంటుంది. దీన్ని తక్కువ కాలంలో పక్వం చేస్తారు. సలాడ్లు, బ్రెడ్, హెల్తీ డైట్స్‌లో దీనికి మంచి డిమాండ్ ఉంది. నాణ్యమైన చెవ్రే చీజ్ ధర కిలోకు సుమారు ₹3,000 నుంచి ₹5,000 వరకు ఉంటుంది.
బ్లూ డి ఓవెర్న్: (Bleu d’Auvergne) ఆవు పాలతో తయారయ్యే మరో బ్లూ చీజ్. ఇందులోని నీలం బూజు వల్ల ఘాటైన రుచి వస్తుంది. సాస్‌లు, స్టేక్స్, వైన్‌తో దీనిని ఎక్కువగా వాడతారు. దీని ధర కిలోకు సుమారు ₹3,500 నుంచి ₹6,000 వరకు ఉంటుంది.
మున్స్టర్ వెర్సే: (Munster-Géromé) ఆల్సాస్ ప్రాంతానికి చెందిన సంప్రదాయ చీజ్. పక్వం సమయంలో ఉప్పునీటితో కడుగుతారు, అందువల్ల బలమైన వాసన వస్తుంది. స్థానిక వంటకాలతో, బంగాళాదుంపలతో దీనిని ఎక్కువగా వాడతారు. దీని ధర కిలోకు సుమారు ₹4,000 నుంచి ₹6,500 వరకు ఉంటుంది.
బ్యూఫోర్ట్ డి ఆల్పేజ్ (Beaufort d’Alpage) ఫ్రాన్స్‌లో అత్యంత ఖరీదైన చీజ్‌లలో ఒకటి. ఇది వేసవిలో మాత్రమే, ఎత్తైన పర్వతాల్లో మేసే ఆవుల పాలతో తయారవుతుంది. పరిమిత ఉత్పత్తి మరియు సంప్రదాయ పద్ధతుల వల్ల దీని విలువ ఎక్కువ. ఇది ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వాడే ప్రీమియం చీజ్. దీని ధర కిలోకు సుమారు ₹8,000 నుంచి ₹12,000 లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది.