Vijayawada: విజయవాడ చెత్త సమస్యకు పరిష్కారం.. జిందాల్ వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్‌కు తరలింపు!

Vijayawada: విజయవాడ నగరంతో పాటు ఆటోనగర్ ప్రాంతంలో పేరుకుపోతున్న చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టినట్లు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ తెలిపారు. నగరంలోని చెత్తను జిందాల్ వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్‌కు తరలించేలా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు.

Swatch Andhra Corporation
Swatch Andhra Corporation

ఆటోనగర్లో నూతన కంపాక్టర్ను ప్రారంభించిన స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్..

వ్యర్థాల నిర్వహణలో కొత్త అడుగు.. 42 క్యూబిక్ మీటర్ల కంపాక్టర్ అందుబాటులోకి..

విజయవాడ: విజయవాడ నగరంతో పాటు ఆటోనగర్ ప్రాంతంలో పేరుకుపోతున్న చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టినట్లు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ తెలిపారు. నగరంలోని చెత్తను జిందాల్ వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్కు తరలించేలా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు.

ఆటోనగర్లో గురువారం ఏర్పాటు చేసిన నూతన కంపాక్టర్ను చైర్మన్ పట్టాభిరామ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెరుగైన చెత్త సేకరణ, సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతకు ఈ కంపాక్టర్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. 42 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం కలిగిన ఈ కంపాక్టర్కు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ 50 శాతం నిధులను అందించినట్లు చెప్పారు.

ఆటోనగర్ ప్రాంతంలో చెత్త సమస్యపై స్థానిక ఎమ్మెల్యే గద్దె రామమోహన్ రావు, యువనేత గద్దె క్రాంతి కుమార్, ఆటోనగర్ అసోసియేషన్ ప్రతినిధులు, ఐలా పెద్దలు తన దృష్టికి తీసుకువచ్చారని పట్టాభిరామ్ తెలిపారు. సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులతో చర్చలు జరిపి చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

ఆటోనగర్ చెత్తను జిందాల్ ప్లాంట్కు తరలించే విషయంలో గతంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని, విషయం తెలిసిన వెంటనే జిందాల్ ప్లాంట్ యాజమాన్యంతో పాటు మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరి నారాయణ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు, విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ హెచ్.ఎం. ధ్యానచంద్రతో చర్చించి సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు.

విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో ప్రతిరోజూ 10 నుంచి 12 టన్నుల వరకు చెత్త ఉత్పత్తి అవుతోందని, ఆ చెత్తను నిరంతరం జిందాల్ వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్కు తరలించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇకపై ఆటోనగర్లో చెత్త పేరుకుపోకుండా రోజువారీగా చెత్త తరలించేలా ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు.

త్వరలో ఆటోనగర్ పెద్దలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి సూచనలు, సలహాలు తీసుకుంటామని పట్టాభిరామ్ వెల్లడించారు. ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఎండీ ఏఎస్ దినేష్ కుమార్, జోనల్ మేనేజర్ కుంచె బాబ్జీలను కలిసి చెత్త రవాణా సమస్యపై వివరించి పూర్తి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఆటోనగర్లో ఉన్న ట్రాక్టర్ స్టేషన్ను కూడా త్వరలో మరో ప్రాంతానికి తరలించేలా ఏపీఐఐసీ అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. చెత్త సమస్య మళ్లీ తలెత్తకుండా శాశ్వత చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి పరిష్కారానికి సహకరిస్తున్న మీడియా ప్రతినిధులను ఈ సందర్భంగా చైర్మన్ పట్టాభిరామ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జోనల్ మేనేజర్ కుంచె బాబ్జీ, గద్దె క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags

Be the first to react

Latest