బాక్సాఫీస్ హిట్స్ నుంచి కొత్త వెబ్‌సిరీస్‌ల వరకు.. ఈ వీకెండ్‌కు ముందే ఓటీటీలో కొత్త సినిమాల జాతర!
OTT Movies This Week: ఓటీటీ ప్రేక్షకులకు ఈ వారం కూడా వినోదాల విందు సిద్ధమైంది. విభిన్న కథాంశాలతో తెరకెక్కిన సినిమాలు, ఆసక్తికరమైన వెబ్‌సిరీస్‌లు డిజిటల్ వేదికలపై సందడి చేయనున్నాయి. ఇప్పటికే థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రాలతో పాటు కొత్త కంటెంట్ కూడా స్ట్రీమింగ్‌కు రానుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, జీ5 వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఈ వారం అందించనున్న ప్రత్యేక సినిమాలు, సిరీస్‌లపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
- ఈ వారం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, జీ5 వంటి ఓటీటీ వేదికల్లో పలు కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు విడుదల కానున్నాయి.
- థియేటర్లలో సందడి చేసిన చిత్రాలతో పాటు కొత్త వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులకు వినోదాన్ని అందించనున్నాయి.
OTT Movies This Week: ఓటీటీ ప్రేక్షకులకు ఈ వారం కూడా వినోదాల విందు సిద్ధమైంది. విభిన్న కథాంశాలతో తెరకెక్కిన సినిమాలు, ఆసక్తికరమైన వెబ్‌సిరీస్‌లు డిజిటల్ వేదికలపై సందడి చేయనున్నాయి. ఇప్పటికే థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రాలతో పాటు కొత్త కంటెంట్ కూడా స్ట్రీమింగ్‌కు రానుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, జీ5 వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఈ వారం అందించనున్న ప్రత్యేక సినిమాలు, సిరీస్‌లపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
ముఖ్యంగా రజనీకాంత్ నటించిన జైలర్ 2, విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న జంటగా నటించిన రణబాలి సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. వీటితో పాటు క్రైమ్ థ్రిల్లర్లు, హారర్ చిత్రాలు, ఫ్యామిలీ డ్రామాలు కూడా ఓటీటీలోకి రానున్నాయి.
ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, సిరీస్‌ల వివరాలు
అమెజాన్ ప్రైమ్ వీడియో (prime Video)
- జైలర్ 2 – నవంబర్ 12
- ది రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 3 – నవంబర్ 11
నెట్‌ఫ్లిక్స్(Netflix)
- రణబాలి – నవంబర్ 13
- దాయ్రా (Daayra) – నవంబర్ 13
- ది ఎంప్రెస్ సీజన్ 3 – నవంబర్ 12
- హార్ట్‌ల్యాండ్ – నవంబర్ 13
జియోహాట్‌స్టార్(JioHotstar)
- పుష్పక విమానం – నవంబర్ 12
- స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్ – నవంబర్ 13
జీ5(Zee5)
- బ్లైండ్ గేమ్ – నవంబర్ 11
- బాంద్రా – నవంబర్ 13
ప్రేక్షకులకు వినోదాల విందు
ఈ వారం ఓటీటీ విడుదలల్లో యాక్షన్, సస్పెన్స్, క్రైమ్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ వంటి విభిన్న జానర్లకు ప్రాధాన్యత లభిస్తోంది. ముఖ్యంగా కొత్త సినిమాలతో పాటు పాపులర్ వెబ్‌సిరీస్‌ల సరికొత్త సీజన్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఇంట్లోనే కూర్చుని వినోదాన్ని ఆస్వాదించాలనుకునే ప్రేక్షకులకు ఈ వారం మంచి అవకాశమనే చెప్పాలి.
Tags
Be the first to react