ఫిబ్రవరి నెల దర్శనం, ఆర్జిత సేవలు, గదుల కోటా పూర్తి షెడ్యూల్ విడుదల!

TTD Darshanam Tickets: ఫిబ్రవరి నెలలో రథసప్తమి మరియు వసంత కాలపు వాతావరణం కారణంగా తిరుమలకు భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా నవంబర్ 24న ఉదయం 10 గంటలకు విడుదలయ్యే రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు నిమిషాల వ్యవధిలోనే పూర్తవుతాయి కాబట్టి, భక్తులు ముందే తమ ఆధార్ వివరాలు, ఫోన్ నంబర్ మరియు యూపీఐ/నెట్ బ్యాంకింగ్ సిద్ధంగా ఉంచుకుని అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వడం ఉత్తమం.

ఫిబ్రవరి నెల తిరుమల దర్శనం, గదుల కోటా
ఫిబ్రవరి నెల తిరుమల దర్శనం, గదుల కోటా
  • నవంబర్ 18న సుప్రభాతం, తోమాల, అర్చన లక్కీ డిప్ రిజిస్ట్రేషన్!

  • నవంబర్ 21న కల్యాణోత్సవం, వర్చువల్ సేవా టికెట్ల విడుదల!

  • నవంబర్ 23న అంగప్రదక్షిణ, శ్రీవాణి, వయోవృద్ధుల దర్శన కోటా!

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. 2027 ఫిబ్రవరి నెలకు సంబంధించి వివిధ రకాల దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, వసతి గదుల ఆన్‌లైన్ కోటా విడుదల తేదీలను ప్రకటించింది. భక్తులు ముందుగానే తేదీలను తెలుసుకుని టికెట్ల కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించింది.

నవంబర్ 18న ఆర్జిత సేవల ఎలక్ట్రానిక్ డిప్

ఫిబ్రవరి నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల టికెట్ల కోసం నవంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఎలక్ట్రానిక్ డిప్ నమోదు ప్రారంభమవుతుంది. నవంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు భక్తులు నమోదు చేసుకోవచ్చు. డిప్‌లో టికెట్లు పొందినవారు నవంబర్ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు చెల్లింపులు చేయాలి.

నవంబర్ 21న ఇతర ఆర్జిత సేవల టికెట్లు

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను నవంబర్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల కోటాను అందుబాటులోకి తీసుకురానున్నారు.

నవంబర్ 23న ప్రత్యేక దర్శన టోకెన్లు

అంగప్రదక్షిణ టోకెన్లను నవంబర్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అదే రోజు ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను అందుబాటులోకి తీసుకురానున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారి ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు.

నవంబర్ 24న రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు

ఫిబ్రవరి నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను నవంబర్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని వసతి గదుల ఆన్‌లైన్ కోటాను అందుబాటులోకి తీసుకురానున్నారు.

భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, వసతి గదుల బుకింగ్ కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ను మాత్రమే వినియోగించాలని అధికారులు సూచించారు.

ముఖ్యమైన తేదీలు:

తేదీ

సమయం

వివరాలు

నవంబర్ 18

ఉదయం 10

ఆర్జిత సేవల డిప్ నమోదు

నవంబర్ 21

ఉదయం 10

ఇతర ఆర్జిత సేవలు

నవంబర్ 21

మధ్యాహ్నం 3

వర్చువల్ సేవలు

నవంబర్ 23

ఉదయం 10

అంగప్రదక్షిణ టోకెన్లు

నవంబర్ 23

ఉదయం 11

శ్రీవాణి దర్శనం

నవంబర్ 23

మధ్యాహ్నం 3

వృద్ధులు, దివ్యాంగుల దర్శనం

నవంబర్ 24

ఉదయం 10

రూ.300 ప్రత్యేక దర్శనం

నవంబర్ 24

మధ్యాహ్నం 3

వసతి గదుల కోటా

Tags

Be the first to react

Latest