Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డు రికార్డుల వేట.. 2025-26లో ఆల్ టైమ్ హై విక్రయాలు! Karate Kalyani: ఆకివీడులో రగిలిన ఉద్రిక్తత.. రామాలయ నిర్మాణంపై పట్టు.. హిందూ సంఘాల నేతల అరెస్ట్.. Saptashrungi Temple: దేవి దర్శనం ఇక అత్యంత సులభం.. 3 నిమిషాల్లోనే కొండపైకి! Tirumala Latest Updates: తిరుమల నడకమార్గాల్లో హైటెక్ భద్రత.... చిరుతల కదలికలపై టీటీడీ డ్రోన్ నిఘా! Happy Easter: మరణంపై జీవపు విజయం.. ఈస్టర్ పండుగ విశిష్టత.. పునరుత్థాన ఆదివారం వెనుక ఉన్న మర్మం! TTD UPdates: భక్తులకు టీటీడీ కీలక సూచన.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం! ఒక్క రోజులోనే.. Tirumala Latest Updates: తిరుమలలో భక్తుల రద్దీ... సర్వదర్శనానికి 12 గంటల సమయం! TTD Darshan Update: శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. తిరుమల లేటెస్ట్ అప్‌డేట్స్ ఇవే! Secret Temples of India: పెళ్లి కాక ఇబ్బంది పడుతున్నారా? ఈ గుడికి వెళ్తే చాలు.. 90 రోజుల్లో శుభవార్త పక్కా! TTD Updates: కార్డు స్థాయిలో శ్రీవారి హుండీ కలెక్షన్.. సర్వదర్శనానికి 12 గంటల సమయం.. Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డు రికార్డుల వేట.. 2025-26లో ఆల్ టైమ్ హై విక్రయాలు! Karate Kalyani: ఆకివీడులో రగిలిన ఉద్రిక్తత.. రామాలయ నిర్మాణంపై పట్టు.. హిందూ సంఘాల నేతల అరెస్ట్.. Saptashrungi Temple: దేవి దర్శనం ఇక అత్యంత సులభం.. 3 నిమిషాల్లోనే కొండపైకి! Tirumala Latest Updates: తిరుమల నడకమార్గాల్లో హైటెక్ భద్రత.... చిరుతల కదలికలపై టీటీడీ డ్రోన్ నిఘా! Happy Easter: మరణంపై జీవపు విజయం.. ఈస్టర్ పండుగ విశిష్టత.. పునరుత్థాన ఆదివారం వెనుక ఉన్న మర్మం! TTD UPdates: భక్తులకు టీటీడీ కీలక సూచన.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం! ఒక్క రోజులోనే.. Tirumala Latest Updates: తిరుమలలో భక్తుల రద్దీ... సర్వదర్శనానికి 12 గంటల సమయం! TTD Darshan Update: శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. తిరుమల లేటెస్ట్ అప్‌డేట్స్ ఇవే! Secret Temples of India: పెళ్లి కాక ఇబ్బంది పడుతున్నారా? ఈ గుడికి వెళ్తే చాలు.. 90 రోజుల్లో శుభవార్త పక్కా! TTD Updates: కార్డు స్థాయిలో శ్రీవారి హుండీ కలెక్షన్.. సర్వదర్శనానికి 12 గంటల సమయం..

Simhachalam: ఘనంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం! భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు..

Simhachalam: సింహాచలం లో ప్రసిద్ధి చెందిన సింహాద్రి అప్పన్న స్వామి వార్షిక చందనోత్సవాన్ని ఈ నెల 20న ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం సిద్ధమవుతోంది.

Published : 2026-04-11 16:11:00

ఈ నెల 20న సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. 

దర్శనాల కోసం 5 క్యూ లైన్లు ఏర్పాటు.. 

విశాఖపట్నం: సింహాచలం లో ప్రసిద్ధి చెందిన సింహాద్రి అప్పన్న స్వామి వార్షిక చందనోత్సవాన్ని ఈ నెల 20న ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం సిద్ధమవుతోంది. నిబంధనల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి తెలిపారు.

చందనోత్సవం రోజు ప్రత్యేకత ఏమిటంటే… సాధారణంగా చందనంతో కప్పబడి ఉండే స్వామివారి “నిజరూప దర్శనం” భక్తులకు లభిస్తుంది. అందుకే ఈ ఉత్సవానికి భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఉత్సవం రోజున ముందుగా పూసపాటి వంశస్థులు సంప్రదాయం ప్రకారం అప్పన్న స్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత సాధారణ భక్తులకు దర్శనాలు ప్రారంభమవుతాయి.

భక్తుల సౌకర్యార్థం ఈసారి ఐదు క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒకేసారి సుమారు 25 వేల మంది వరకు దర్శనం చేసుకునేలా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని భద్రతా చర్యలు కూడా పెంచుతున్నారు.

టెక్నాలజీ వినియోగాన్ని పెంచుతూ… ఈసారి దర్శన టికెట్లు, వాహనాల పాస్‌లపై క్యూ ఆర్ కోడ్ విధానం అమలు చేస్తున్నారు. దీంతో నకిలీ టికెట్లు, అవాంఛనీయ సమస్యలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.

నిజరూప దర్శనానికి సంబంధించిన టికెట్లు ఈ నెల 16 నాటికి కలెక్టరేట్‌కు చేరనున్నాయి. అలాగే మొత్తం దర్శన టికెట్లలో 70 శాతం టికెట్లు ఆన్‌లైన్ ద్వారా విక్రయించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

భక్తులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని, క్రమశిక్షణతో దర్శనానికి రావాలని అధికారులు సూచిస్తున్నారు. ఈసారి చందనోత్సవం మరింత సౌకర్యవంతంగా, భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగించేలా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Spotlight

Read More →