Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 20-24 గంటల సమయం!

Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి.

TTD
TTD

శిలాతోరణం వరకు క్యూ లైన్.. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల వెల్లువ..

శ్రీవారి హుండీకి రూ.4.06 కోట్ల ఆదాయం.. 4.73 లక్షల లడ్డూల విక్రయం..

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. ప్రస్తుతం క్యూ లైన్ శిలాతోరణం వరకు విస్తరించింది.

టీటీడీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు సుమారు 20 నుంచి 24 గంటల వరకు సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (శీఘ్రదర్శనం) ద్వారా వెళ్లే భక్తులకు 3 నుంచి 5 గంటలలో దర్శనం లభిస్తోంది. అలాగే సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 5 నుంచి 7 గంటలలో స్వామివారి దర్శనం పూర్తవుతోంది.

శుక్రవారం తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా నమోదైంది. ఒక్కరోజే 90,045 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని స్వామివారి కృపను పొందారు. వారిలో 38,573 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

అదే రోజు శ్రీవారి హుండీ ద్వారా రూ.4.06 కోట్ల ఆదాయం సమకూరింది. భక్తులకు మొత్తం 4.73 లక్షల లడ్డూలను విక్రయించారు. అలాగే 3.10 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించగా, 3,616 మంది భక్తులకు టీటీడీ వైద్య సేవలు అందించింది.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అన్ని విభాగాలను అప్రమత్తం చేసింది. దర్శనం, లడ్డూ పంపిణీ, అన్నప్రసాదం, వైద్య సేవలు, భద్రత, పారిశుద్ధ్య ఏర్పాట్లను మరింత పటిష్ఠం చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటోంది.

టీటీడీ అధికారులు భక్తులు తమ ప్రయాణాన్ని నిరీక్షణ సమయాలకు అనుగుణంగా ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని, అధికారిక సమాచారం ఆధారంగానే తిరుమల ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

Tags

Be the first to react

Latest