సామాన్యుడిపై మరో భారం! వడ్డీ రేటును పెంచిన RBI !

RBI Repo Rate Hike: దేశ ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (MPC) రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపో రేటు 5.50 శాతానికి చేరింది. అంతేకాకుండా.. ఆర్బీఐ తన విధాన వైఖరిని ‘టైటెనింగ్’ వైపు మార్చింది.

RBI Governor Sanjay Malhotra announces Repo Rates Hike
RBI Governor Sanjay Malhotra announces Repo Rates Hike
  • రెపో రేటు 5.50 శాతానికి పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం.
  • 2026-27 ఆర్థిక సంవత్సరానికి GDP వృద్ధి అంచనాను 7.1 శాతానికి పెంచింది.

RBI Repo Rate Hike: దేశ ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (MPC) రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపో రేటు 5.50 శాతానికి చేరింది. అంతేకాకుండా.. ఆర్బీఐ తన విధాన వైఖరిని ‘టైటెనింగ్’ వైపు మార్చింది.

నాలుగు సార్లు తగ్గించిన తర్వాత తొలిసారి పెంపు

2025లో ఆర్బీఐ వరుసగా నాలుగు విడతల్లో రెపో రేటును మొత్తం 125 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఆ తర్వాత కొంతకాలం వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఇప్పుడు అంతర్జాతీయ పరిణామాలు, పెరుగుతున్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని మళ్లీ రేటు పెంపునకు వెళ్లింది. గతంలో చివరిసారిగా 2023 ఫిబ్రవరిలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచగా.. అది 6.50 శాతానికి చేరింది.

ద్రవ్యోల్బణం.. అంతర్జాతీయ పరిణామాల ప్రభావం

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన సరఫరాలపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ముడిచమురు ధరలు పెరిగే అవకాశాలు ద్రవ్యోల్బణంపై ఆందోళనలను పెంచుతున్నాయి. దేశీయంగా ఆహార ధరల్లో ఒడిదుడుకులు కూడా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ధరల స్థిరత్వాన్ని కాపాడటమే లక్ష్యంగా ఆర్బీఐ వడ్డీ రేటును పెంచినట్లు తెలుస్తోంది.

GDP వృద్ధి అంచనా పెంపు

మరోవైపు, భారత ఆర్థిక వ్యవస్థపై ఆర్బీఐ సానుకూల అంచనాను వ్యక్తం చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి GDP వృద్ధి అంచనాను 7.1 శాతానికి పెంచింది. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ దేశీయ ఆర్థిక కార్యకలాపాలు బలంగా కొనసాగుతున్నాయని RBI అంచనా వేస్తోంది.

రుణ గ్రహీతలకు EMI భారం పెరిగే అవకాశం

రెపో రేటు పెంపు నేరుగా బ్యాంకుల రుణాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా రెపో రేటుతో అనుసంధానమైన హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు, ఇతర రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లు పెరగొచ్చు. దీంతో కొత్తగా రుణాలు తీసుకునేవారితో పాటు ఇప్పటికే రుణాలు చెల్లిస్తున్న కొందరు వినియోగదారుల EMI భారం కూడా పెరిగే అవకాశం ఉంది.

నిర్ణయానికి ముందు మార్కెట్లలో ఒత్తిడి

MPC నిర్ణయం వెలువడకముందు దేశీయ స్టాక్ మార్కెట్లు అప్రమత్తంగా వ్యవహరించాయి. బుధవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. వడ్డీ రేట్లపై ఆర్బీఐ నిర్ణయం, ఆర్థిక వృద్ధి-ద్రవ్యోల్బణంపై కేంద్ర బ్యాంకు అంచనాల కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూశారు. అయితే రెపో రేటు నిర్ణయం వెలువడిన తర్వాత మార్కెట్లలో స్వల్పంగా కోలుకునే ధోరణి కనిపించింది.

సామాన్యుడిపై ప్రభావం ఎలా?

ఒకవైపు ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు ఆర్బీఐ రేటు పెంపు నిర్ణయం తీసుకోగా.. మరోవైపు రుణాలు తీసుకున్న వారికి ఇది కొంత భారంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలు ఉన్నవారు EMIల మార్పులను గమనించాల్సి ఉంటుంది. ముడిచమురు ధరలు, ఆహార ధరలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులను ఆర్బీఐ నిశితంగా పరిశీలించనుంది.

Tags

Be the first to react

Latest