డిసెంబర్ బ్యాంకు సెలవుల జాబితా విడుదల.. ముఖ్యమైన తేదీలివే
December 2026 Bank Holidays: బ్యాంకులకు సంబంధించిన పనులు ఉన్నవారు డిసెంబర్ నెల సెలవుల జాబితాపై ముందుగానే దృష్టి పెట్టాలి. వచ్చే నెలలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 18 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవుల క్యాలెండర్‌ను ప్రకటించింది. ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారంతో పాటు ప్రాంతీయ పండుగలు, ప్రత్యేక దినోత్సవాల కారణంగా ఈ సెలవులు ఉండనున్నాయి.
- డిసెంబర్‌లో పండుగలు, వారాంతాలతో బ్యాంకులకు సెలవులు.
- ఏపీ, తెలంగాణలో మొత్తం 7 రోజులు బ్యాంకులు పనిచేయవు.
December 2026 Bank Holidays: బ్యాంకులకు సంబంధించిన పనులు ఉన్నవారు డిసెంబర్ నెల సెలవుల జాబితాపై ముందుగానే దృష్టి పెట్టాలి. వచ్చే నెలలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 18 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవుల క్యాలెండర్‌ను ప్రకటించింది. ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారంతో పాటు ప్రాంతీయ పండుగలు, ప్రత్యేక దినోత్సవాల కారణంగా ఈ సెలవులు ఉండనున్నాయి.
డిసెంబర్‌లో వరుస సెలవులు
సాధారణంగా ప్రతి నెలా ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం బ్యాంకులకు సెలవులు ఉంటాయి. డిసెంబర్‌లో 6, 13, 20, 27 తేదీల్లో ఆదివారాలు రానున్నాయి. అదేవిధంగా 12న రెండో శనివారం, 26న నాలుగో శనివారం కావడంతో బ్యాంకులు పనిచేయవు. ముఖ్యంగా డిసెంబర్ 25న క్రిస్మస్, 26న నాలుగో శనివారం, 27న ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి.
రాష్ట్రాలవారీగా బ్యాంకు సెలవులు
డిసెంబర్ 1న రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్‌లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. డిసెంబర్ 3న సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పండుగ నేపథ్యంలో గోవాలో బ్యాంకులు మూతపడతాయి.
సిక్కింలో లోసూంగ్, నామ్‌సూంగ్ పండుగల కారణంగా డిసెంబర్ 9, 11 తేదీల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిచిపోతాయి. డిసెంబర్ 18న యు సోసో థామ్ వర్ధంతి సందర్భంగా మేఘాలయలో, 19న గోవా విమోచన దినోత్సవం సందర్భంగా గోవాలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
డిసెంబర్ 24న క్రిస్మస్ ఈవ్ సందర్భంగా కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు. డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఇక డిసెంబర్ 30న యు కియాంగ్ నాంగ్‌బా వర్ధంతి సందర్భంగా మేఘాలయలో, 31న నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మిజోరంలో బ్యాంకులు సెలవు.
ఏపీ, తెలంగాణ ఖాతాదారులకు ఎన్ని రోజులు సెలవులు?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో డిసెంబర్ నెలలో సాధారణ వారాంతపు సెలవులతో పాటు క్రిస్మస్ పండుగకు బ్యాంకులు మూసివేయనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో డిసెంబర్ 6, 12, 13, 20, 25, 26, 27 తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి. మొత్తంగా ఏడు రోజులు బ్యాంకు శాఖల్లో ప్రత్యక్ష సేవలు అందుబాటులో ఉండవు.
డిజిటల్ సేవలకు అంతరాయం ఉండదు
బ్యాంకు శాఖలకు సెలవులు ఉన్నప్పటికీ డిజిటల్ లావాదేవీలకు ఎలాంటి ఆటంకం ఉండదు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు, గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి చెల్లింపు యాప్‌లు యథావిధిగా పనిచేస్తాయి. ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణ కూడా చేసుకోవచ్చు. అయితే చెక్కుల క్లియరెన్స్, నగదు డిపాజిట్లు, ఇతర శాఖాపరమైన పనుల కోసం బ్యాంకుకు వెళ్లాల్సిన వారు సెలవులను దృష్టిలో ఉంచుకుని ముందుగానే తమ పనులు పూర్తి చేసుకోవడం ఉత్తమం.
Be the first to react